NTV Telugu Site icon

Nehal Vadhera : వెరైటీ శిక్ష అనుభవించిన ముంబై బ్యాటర్

Vadera

Vadera

ఐపీఎల్ 2023ని ముంబై ఇండియన్స్ జట్టు కరెక్టుగా స్టార్ట్ ప్రారంభించలేదు.. కానీ, ఇప్పుడు ఈ జట్టు తిరిగి ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ప్రతిసారీ మాదిరిగానే ఈ సీజన్‌లోనూ ముంబై జట్టుకు ప్రతిభ గల ఆటగాడు నేహాల్ వధేరా. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నెహాల్ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ఈ బ్యాట్స్‌మెన్ ఎయిర్‌పోర్ట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో కనిపించాడు.

Also Read : Ravi Teja: జాతిరత్నంతో రవితేజ నెక్ట్స్ సినిమా..?

ముంబై టీమ్ మే 16న లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ నెక్ట్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు లక్నో వెళ్తుండగా.. నెహాల్ ఎయిర్‌పోర్ట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో కనిపించారు. ఆటగాళ్ళు జట్టుతో వచ్చినప్పుడు.. వారు టీ-షర్టులు లేదా జంప్ సూట్‌లను వేసుకుంటారు.. కానీ నెహాల్ వధేరా మాత్రం ప్యాడ్‌లను ధరించాడు. రెండు కాళ్లకు ప్యాడ్‌లు ధరించి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. నేహాల్ ప్యాడ్ ధరించి విమానాశ్రయానికి వెళ్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

Also Read : DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సార్లు త్యాగం చేశా…

నేహాల్‌ వధేరాకు శిక్ష పడడం వల్లే ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ప్లేయర్లతో ఓ మీటింగ్ న్ని ముంబై మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నెహాల్ ఆలస్యంగా రావడం వల్లే.. అందుకే అతనికి ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. జట్టుతో పాటు, నెహాల్ కూడా సరదాగా ఈ శిక్షను అనుభవించాడు. అందుకే నేహాల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాడ్‌ వేసుకుని నడుస్తున్నది మనకు కనిపిస్తుంది.

Also Read : Kottu Satyanarayana : చరిత్రలో ఎవరూ చేయలేని యజ్ఞాన్ని మా ప్రభుత్వం చేస్తోంది..

ఈ సీజన్‌లోనే నెహాల్ వధేరా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అతను తన మొదటి సీజన్‌లోనే మంచి ముద్ర వేసుకోగలిగాడు. ఇప్పటి వరకు నెహాల్ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 198 రన్స్ చేశాడు. ఈ సమయంలో అతని సగటురేట్ 33గా ఉంది. ఈ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ 151.15 స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేశాడు. ఇప్పటి వరకు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.