NTV Telugu Site icon

IPL 2023 : కావ్య పాపకు కోపం వచ్చిందోచ్

Kavya

Kavya

సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆటగాళ్ల కంటే ఒకరిమీదే కెమెరాలు ఎక్కువగా ఫోకస్ గా ఉంటాయి.. అయ్యే ఎవరో మీకు తెలియడం లేదా.. అదేనండీ బాబు.. మన సన్ రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్.. ప్రతీ సీజన్ లో ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ లు ఎక్కడ జరిగితే అక్కడ టక్కువ వచ్చి వాలిపోయి వారిని ఉత్సహపరుస్తుంది. జట్టు ఓడిపోయి తాను బాధపడుతుంది. గెలిస్తే ఆ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంటుంది. అలాంటి కావ్య మారన్ కు ఆదివారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా ఒక కెమెరామెన్ కోపం తెప్పించాడు. ఆ కోపానికి వేరే కారణం ఉంది లెండి. పంజాబ్ కింగ్స్ ఇన్సింగ్స్ సమయంలో 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని కావ్యా మారన్ తెగ సంతోషపడిపోయింది.

Also Read : Covid: నేడు దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్

కానీ కాసేపటికే సీన్ మారిపోయింది. శిఖర్ ధావన్ తన క్లాస్ బ్యాటింగ్ తీరుతో అందరిని ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్ కు ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్ లో కూర్చొని సీరియస్ గా చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో చల్ హట్ రే అని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులతో అసమాన ఆటతీరును ప్రదర్శించి పంజాబ్ కు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గె్ట్ ను ఛేదించింది.

Also Read : SRH vs PBKS : బోణీ కొట్టిన SRH.. పంజాబ్‌పై గెలుపు

Show comments