NTV Telugu Site icon

DC vs SRH: స్టార్‌ బ్యాటర్‌ వచ్చేస్తున్నాడు.. ఢిల్లీని సన్‌రైజర్స్‌ అడ్డుకోనేనా?

Dc Vs Srh Preview

Dc Vs Srh Preview

ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది. గత మ్యాచ్‌లో లక్నోపై గెలిచిన ఢిల్లీ ఫుల్ జోష్‌లో ఉంది. అదే ఊపును ఎస్‌ఆర్‌హెచ్‌పై కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్‌.. లక్నోపై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మంచి విజయంతో మరలా పుంజుకోవాలని చూస్తోంది.

లక్నోతో మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం ఎస్‌ఆర్‌హెచ్‌ను దెబ్బ తీసింది. అద్భుత బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ భీకర బ్యాటింగ్‌ లైనప్‌కు లక్నో బౌలర్లు కళ్లెం వేశారు. మిచెల్ స్టార్క్‌, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. స్టార్క్‌ ఆరంభంలో చెలరేగితే సన్‌రైజర్స్‌కు కష్టాలు తప్పవు. హెడ్, అభిషేక్, ఇషాన్‌, నితీశ్‌, క్లాసెన్‌ సత్తా చాటితే మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోరు సాధించడం ఖాయం. సన్‌రైజర్స్‌కు బౌలింగ్‌ కూడా సమస్యగా మారింది. కమిన్స్‌, షమీ, జంపా, హర్షల్ ప్రభావం చూపలేకపోతున్నారు.

కుమార్తె జన్మించడంతో ఢిల్లీ ఆడిన తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేని స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులో చేరాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో అదరగొట్టిన రాహుల్‌.. ఐపీఎల్‌లో చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. రాహుల్‌ రాకతో ఢిల్లీ బ్యాటింగ్‌ పటిష్టంగా మారింది. అశుతోష్‌శర్మ, విప్రాజ్‌ నిగమ్‌ మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. మెక్‌గుర్క్, డుప్లెసిస్, స్టబ్స్, పోరెల్, రిజ్విలు ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఢిల్లీని సన్‌రైజర్స్‌ అడ్డుకుంటుందో లేదో చూడాలి.

Also Read: Rohit Sharma: తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

తుది జట్లు (అంచనా):
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ.