Site icon NTV Telugu

iPhone 17 Pro Price Drop: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. 70 వేలకే ఐఫోన్ 17 ప్రో!

Iphone 17 Pro Price Drop

Iphone 17 Pro Price Drop

మీరు ‘యాపిల్’ ఐఫోన్ 17 ప్రో కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి తరుణం. సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఇటీవల తన ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ సహా కొత్త ఐఫోన్ ఎయిర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్.

భారతదేశంలో ఐఫోన్ 17 (256GB) ధర రూ.82,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 ప్రో రూ.1,34,900.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ.1,49,900 ధరలతో ప్రారంభమవుతాయి. అమెజాన్‌లో ఐఫోన్ 17 ప్రో (256GB)పై అతిపెద్ద డీల్‌ను అందిస్తోంది. ఎక్స్‌ఛేంజ్‌ కింద వినియోగదారులు రూ.58,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఎక్స్‌ఛేంజ్‌ విలువ మీ పాత స్మార్ట్‌ఫోన్‌ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ పొందితే ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900 నుంచి రూ.76,900కి తగ్గుతుంది.

అమెజాన్‌లో ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ మాత్రమే కాదు.. బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు చేస్తే.. రూ.6,745 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు ఆఫర్‌లను కలిపితే ఐఫోన్ 17 ప్రో ఫోన్ కేవలం రూ.70,155కి మీ సొంతం అవుతుంది. ఇప్పటికే 17 ప్రో విక్రయాల పరంగా దూసుకెళుతోంది. సొగసైన డిజైన్, అద్భుతమైన కెమెరా, అధునాతన ప్రాసెసర్ ఉండడంతో కొనుగోళ్లలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆఫర్ యాపిల్ వినియోగదారులకు ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి.

Exit mobile version