Site icon NTV Telugu

iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో పై ఏకంగా రూ.19,701 భారీ డిస్కౌంట్..!

Apple Iphone 16 Pro 128 Gb, Desert Titanium

Apple Iphone 16 Pro 128 Gb, Desert Titanium

iPhone 16 Pro: ఐఫోన్ అభిమానులకు క్రేజీ ఆఫర్ ను తీసుక వచ్చింది జియోమార్ట్. ఎప్పటినుంచో iPhone 16 Pro కొనాలనుకుంటున్నా.. ధర ఎక్కువగా ఉందని వెనకడుగు వేసిన వారికి శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ రిటైల్ ప్లాట్‌ ఫామ్ జియోమార్ట్ ఇప్పుడు iPhone 16 Pro పై ఏకంగా రూ.19,701 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొత్తగా ఫోన్ మార్చాలనుకుంటున్నా, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారాలనుకుంటున్నా ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఆఫర్ సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దామా..

Read Also:Houthi Rebels: హౌతీ రెబల్స్ చెరలో ఎటర్నిల్ సీ సిబ్బంది..

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.1,19,900 గా ఉంది. అయితే, ప్రస్తుతం జియోమార్ట్‌ లో దీని ధరను రూ.1,07,199 కు తగ్గించారు. అంటే ఏకంగా రూ.12,701 తగ్గింపు అనమాట. ఆఫర్ ఇంతే కాదండోయ్.. ఇంకా ఉంది అప్పుడే ఐపోలేదు. ఈ ఫోన్ కొనుగోలు చేసే వారు.. క్రెడిట్ కార్డ్స్ వాడినట్లైతే మరింత ప్రయోజనం పొందవచ్చు. అది ఎలా అంటే.. BOB (బ్యాంక్ ఆఫ్ బరోడా) క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగదారులు అదనంగా మొబైల్ పై రూ.7,000 తగ్గింపు పొందవచ్చు. దీంతో మొబైల్ ఫైనల్ ధర కేవలం రూ.1,00,199 మాత్రమే అవుతుంది. దీనితో మొత్తం ఆఫర్ కలిపితే రూ.19,701 తగ్గింపు పొందవచ్చు. మారేందుకు ఆలశ్యం.. ఐఫోన్ కొనే ఆలోచనలో ఉన్నవారు కొనడానికి ఇదే సరైన సమయం. ఈ లిమిటెడ్ డీల్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు..

Read Also:Bhagwant Mann: మోడీ టూర్‌పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఖండించిన విదేశాంగ శాఖ

ఒకసారి iPhone 16 Pro స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే..
డిస్‌ప్లే: 6.3-ఇంచుల LTPO OLED, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్, HDR10 & Dolby Vision సపోర్ట్

ప్రాసెసర్: Apple తాజా A18 Pro చిప్, 8GB RAM.

స్టోరేజ్ వేరియంట్లు: 128GB నుండి 1TB వరకు.

కెమెరా సెటప్: 48MP ప్రైమరీ, 12MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్, 12MP ఫ్రంట్ కెమెరా.

బ్యాటరీ: 3582mAh, 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ ఛార్జింగ్.

Exit mobile version