Site icon NTV Telugu

iPhone 16 Pro Price Drop: ఇదే బెస్ట్ డీల్, అస్సలు మిస్ అవ్వొద్దు.. 34 వేలకే ఐఫోన్ 16 ప్రో!

Iphone 16 Pro Price Drop

Iphone 16 Pro Price Drop

ప్రముఖ టెక్‌ దిగ్గజం ‘యాపిల్‌’ ఐఫోన్‌ 17 సిరీస్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్‌ 17 ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 17 సిరీస్ ఫోన్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో 16 సిరీస్ ఫోన్‌ల ధరలను యాపిల్‌ కంపెనీ తగ్గించింది. అంతేకాదు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గింపు ఉంది. అన్ని ఆఫర్స్ కలుపుకుంటే.. ఐఫోన్ 16 ప్రో లాంచ్ ధరతో పోలిస్తే ఇప్పుడు హాఫ్ రేటుకే మీ సొంతం అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

ఐఫోన్ 16 ప్రో గత ఏడాది రూ.1,19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇదే ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ 2025లో రూ.74,900కు లభిస్తుంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ మీకు వర్తించనున్నాయి. అంటే మీకు 45 వేలకు పైగా తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ డీల్స్ సహా అదనంగా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దాంతో మరింత తక్కువకే ఐఫోన్ 16 ప్రోను సొంతం చేసుకోవచ్చు.

Also Read: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే.. ఏ జట్టుకు బెనిఫిట్?

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇప్పుడు ఐఫోన్ 16 ప్రోపై రూ.40,650 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఉంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. ఐఫోన్ 16 ప్రోను కేవలం 34 వేలకే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అయితే మీ పాత మొబైల్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తిస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎక్స్‌ఛేంజ్‌ లేకున్నా మీరు రూ.74,900కు ఐఫోన్ 16 ప్రోను కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్‌లపై కూడా బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు యాపిల్ లవర్స్ అయితే.. ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు.

Exit mobile version