NTV Telugu Site icon

Warren Buffett: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నాను: వారెన్ బఫెట్

Baffet

Baffet

Investor Warren Buffett: ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ యాన్యువల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి వారెన్ బఫెట్ స్పందించారు. భారతదేశంలో షేర్లు గత 20 ఏళ్లలో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయన్నారు. ఐదో పెద్ద ఎకానమీగా ఉన్న ఇండియా తర్వలో మూడో ప్లేస్ కు చేరుకోబోతుందని తెలిపారు. ఇండియన్ ఈక్విట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని బెర్క్ షైర్ చూస్తోందా అనే ప్రశ్నకు.. బఫెట్ స్పందిస్తూ.. ఇండియా లాంటి దేశాల్లో బోలెడు అవకాశాలు ఉంటాయన్నారు. బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ దీని గురించి ఆలోచిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సంస్థ ఎక్కువగా యూఎస్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది.. కొన్ని సందర్భాల్లో మాత్రమే బయట దేశాల్లో ఇన్వెస్ట్ చేసిందన్నారు.

Read Also: Mudragada Vs Pawan: పవన్‌ కల్యాణ్ ఆఫర్‌..! ముద్రగడ కౌంటర్‌

కానీ, గతేడాది ఐదు జపనీస్ ట్రేడింగ్ హౌస్‌‌‌‌‌‌‌‌లలో డబ్బులు పెట్టింది.. అయితే, వీటి వాల్యుయేషన్ తక్కువగా ఉందని అని వారెన్ బఫెట్ పేర్కొన్నారు. ఇండియాలో ఇంకా గుర్తించని బోలెడు ఛాన్స్ లు ఉండొచ్చు. వీటి గురించి ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆలోచిస్తామన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లాభమా? నష్టమా అనే దానిపై చర్చలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇతరుల డబ్బులను మేనేజ్ చేస్తున్న వెల్త్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలతో పోటీ ఉంటుంది.. బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ దగ్గర సుమారు 200 బిలియన్ డాలర్ల క్యాష్​ ఫ్లోస్ ఉన్నట్లు అంచనా.. ఏదైనా కంపెనీలో మెజార్టీ షేర్లు కొనుగోలు చేయడం లేదా కంపెనీ మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని వారెన్ బఫెట్ తెలిపారు.