NTV Telugu Site icon

Hyderabad : హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు

Hyd

Hyd

హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఐదుగురిని అనుమానితుల్ని ఆదుపులోకి తీసుకున్నారు. భోపాల్కు చెందిన 11 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు మధ్యప్రదేశ్ కు తరలిస్తున్నారు.

Also Read : Foxconn: బెంగళూర్‌లో భారీ ధరతో భూమి కొనుగోలు చేసిన ఐఫోన్ మేకర్..

నిందితుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు, ఎలక్ట్రానిక్ డివైస్‌, డ్రాగన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇస్లామిక్ జిహాదీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గత 18 నెలల నుంచి హైదరాబాద్ లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. యవతను ఉగ్రవాదం, టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Travel Tips: ప్రపంచంలోనే అద్భుతమైన రోడ్లు.. ఒక్కసారి ప్రయాణిస్తే చాలు..

మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులు.. హైదరాబాద్ లో 16 మంది.. ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో అరెస్ట్ చేయటంతో ప్రస్తుతం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. దీంతో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రాజకీయంగా హై ఓల్టేజీలో ఉన్నాయి పాలిటిక్స్. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ పోలీసులు.. హైదరాబాద్ వచ్చి మరీ ఐదుగురిని అరెస్ట్ చేయటం కలకలం రేపుతోంది.

Also Read : Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..

అయితే హైదరాబాద్ లో పట్టుబడ్డ వాళ్లంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లే.. పట్టుకున్న వాళ్ళని భోపాల్ కు ఏటీఎస్ అధికారులు తరలించారు. భోపాల్‌లోని బాగ్ ఉమ్రావ్ దుల్హా, జవహర్ కాలనీ, బాగ్ ఫర్హత్ అఫ్జాలో నలుగురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నాలుగు చోట్ల నుంచి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన యువకులే ఉగ్రవాద సంస్థతో లింకులు పెట్టుకున్నాట్లు పోలీసులు వెల్లడించారు. భోపాల్‌లోని ఐష్‌బాగ్ , చింద్వారాలో కూడా అర డజనుకు పైగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ వారికి హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థ తో లింకులున్నట్లు గుర్తించారు.