Yogaday Countdown : జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం రంగురంగుల తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా జూన్ 20న 24 గంటల ముందు కౌంట్‌డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత భారత్‌దే అని పలువురు ప్రముఖులు ఈ వేడుకల సందర్భంగా తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అందరూ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర బొగ్గు, ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, శాసన సభ్యులు, ఎంపీలు, సినీ ప్రముఖులు, యోగా గురువులు హాజరయ్యారు. సినీ నటి ఖుష్బూ సుందర్, మీనాక్షి చౌదరి, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జ లాంటి తారలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖుష్బూ సుందర్ యోగా ప్రాముఖ్యతను వివరించారు.
Illegal Affair : ప్రియుడి మోజు.. నాలుగు ప్రాణాలు తీసిన విషాదం..!
ఎల్బీ స్టేడియం యోగా ప్రియులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది పాల్గొనడంతో ప్లేస్ సరిపోకపోవడంతో గ్యాలరీల వరకు కూర్చుని యోగా చేస్తున్నారు. యోగా శిక్షకులు ముందుండి సూచనలు ఇస్తుండగా, శంకారవణంతో యోగాసనాలు ప్రారంభమయ్యాయి. పరామిలటరీ, డిఫెన్స్, విద్యాసంస్థలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్లు, యోగా అసోసియేషన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 200కి పైగా దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగా వేడుకల్లో పాల్గొననున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగమవుతున్నారు.
హైదరాబాద్‌లో గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న యోగా ఉత్సవాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ సంవత్సరం యోగ జేఏసీ ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఎల్బీ స్టేడియంలో యోగా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. యోగాను ప్రతిరోజూ అనుసరించడం ద్వారా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. జీవన శైలిలో బలమైన మార్పు రావచ్చని, సమాజంలో సానుకూలత పెరుగుతుందని యోగా గురువులు చెబుతున్నారు.
ENG vs IND: నేడే ఇంగ్లండ్, భారత్ తొలి టెస్టు.. ప్లేయింగ్ 11, పిచ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్!
