Site icon NTV Telugu

International Yoda Day 2024: మంచు పర్వతాల నుంచి ఇసుక దిబ్బల వరకు భారత సైనికుల యోగా..

Yoga

Yoga

International Yoda Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం నుంచి అమెరికా దేశం వరకు ఉన్న ప్రజలు ఉత్సాహంగా యోగా చేస్తూ కనిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ రోజు (జూన్ 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. కాగా, లేహ్‌లోని పాంగోంగ్ త్సోలో ఐటీబీపీ సైనికులు యోగా చేయడం కనిపించింది. అలాగే, సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్‌లో ఐటీబీపీ జవాన్లు 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో యోగా చేశారు.

Read Also: Mukhesh Ambani : ముఖేష్ అంబానీ డీప్‌ఫేక్ వీడియో.. రూ.7లక్షలు మోసపోయిన మహిళా వైద్యురాలు

అలాగే, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 నాడు భారత ఆర్మీ సైనికులు ఉత్తర సరిహద్దులో మంచు కొండలపై యోగా చేశారు. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యం కూడా యోగా సాధన చేసింది. ఇక, తూర్పు లడఖ్‌లోని ఇండియన్ ఆర్మీ అధికారులు తమ యోగా అసనాలతో అలరించారు. దీంతో పాటు లేహ్‌లోని కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ స్టేడియంలో యోగా కార్యక్రమం కూడా నిర్వహించారు. లడఖ్‌లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున స్కూల్ పిల్లలు కూడా యోగా చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా కనిపించింది.

Read Also: World Music Day: పాటలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఇక, యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కేఐసీసీ)లో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరులతో కలిసి యోగా చేశారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమం నుంచి ప్రధాని దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ముంబైలో జరిగిన యోగా సెషన్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అలాగే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి కూడా యోగా చేస్తూ కనిపించారు. వీరితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తదితరులు యోగా చేశారు. కూడా యోగా చేస్తూ కనిపించారు.

Exit mobile version