రాధాగంజ్‌లోని అర్జున్ నగర్ నివాసి అయిన అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం (35) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నివేదికల ప్రకారం, రోహిణి అష్టాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్‌గా పనిచేస్తుందని.. నిన్ననే దేవాస్‌కు తిరిగి వచ్చిందని వెల్లడించాయి. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆదివారం ఉదయం రోహిణి బాగానే ఉన్నట్లు తెలిపారు. అల్పాహారం తర్వాత, ఆమెకు ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత ఆమె గదిలోకి వెళ్లి లోపలి నుండి తలుపు లాక్ చేసుకున్నట్లు తెలిపారు. ఆమె చాలా సేపు బయటకు రాకపోయేసరికి, ఆమె చెల్లెలు ఒక ఇనుప రాడ్ (కడ్డీ)తో తలుపు పగలగొట్టి చూడగా, రోహిణి ఉరి వేసుకుని కనిపించిందని వెల్లడించారు.
Also Read:Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్
గత సంవత్సరం అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ జుజిట్సు పోటీలో రోహిణి కలాం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె కడుపులో కణితికి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆత్మహత్యకు గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఎటువంటి సూసైడ్ నోట్ గుర్తించలేదు. సంఘటన గురించి సమాచారం అందుకున్న బిఎన్‌పి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
