Site icon NTV Telugu

Lung Research Center: ఐఐటీ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం

Iit Hyderabad

Iit Hyderabad

ఐఐటీ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. జర్మని ఇనిస్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సెంటర్ ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, పద్మవిభూషణ్, AIG హాస్పిటల్ అధినేత నాగేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, AIG హాస్పిటల్ అధినేత నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో హార్ట్ ఎటాక్ ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరంగా మారిందన్నారు. కరోనా తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువయ్యాయన్నారు.

Also Read:Story Board: రాజకీయ కుటుంబాల్లో గొడవలకు కారణమేంటి..? ఉత్తరాది, దక్షిణాది ఎక్కడైనా ఇదే తీరా..?

గాలి కాలుష్యం, ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం, ధూమపానం, ఆహారపు అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. దీనిపై అధ్యయనం చేయడానికి జర్మనీలోని ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్, ఐఐటీ హైదరాబాద్ బయో మెడికల్ ఇంజనీరింగ్ సంయుక్తంగా రీసెర్చ్ సెంటర్ ప్రారంభం చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రీసెర్చ్ సెంటర్ లేదన్నారు. కొత్త ఊపిరితిత్తుల కణాలు తయారుచేసేందుకు, వ్యాధులను నివారించేందుకు ఈ సెంటర్ దోహదపడుతుందని నాగేశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version