Kite Festival: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ‘అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2026’ ప్రారంభమైంది. రంగురంగుల పతంగులతో భాగ్యనగర ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్‌లా మారిపోయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ఫ్లయర్స్ తరలివచ్చారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఉక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుండి 40 మంది నిపుణులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Nayanthara Remuneration: రూ.4 కోట్ల నుంచి 18 కోట్లకు.. ఆ ఒక్క హిట్ నయనతార కెరీర్‌నే మార్చేసింది!
అలాగే భారత దేశంలోని 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ పాల్గొని వైవిధ్యమైన పతంగులను ఎగురవేస్తున్నారు. భూమి నుండి ఆకాశానికి రంగురంగుల సందేశాలు పంపుతున్నారా అన్నట్టుగా గ్రౌండ్ అంతా పతంగులతో నిండిపోయింది. డాల్ఫిన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, డ్రాగన్లు, భారీ ఆకారాల్లో ఉన్న గాలిపటాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఈ సందర్బంగా హైదరాబాద్ కైట్ ఫెస్టివల్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఉత్సాహం, ఆతిథ్యం అద్భుతం అని అంతర్జాతీయ ఫ్లయర్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ ఏడాది మరికొన్ని పతంగులతో పాటు ప్రత్యేక ఆకర్షణలు కూడా తోడయ్యాయి. అక్కడ వివిధ రాష్ట్రాల సంప్రదాయ మిఠాయిల స్టాల్స్ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 16 నుంచి 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, అలాగే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనున్నాయి.
