Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఫోకస్ పెడుతోంది.. అందులో భాగంగా.. ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందులను అదిగమించే ప్రయత్నాలు చేస్తోంది.. దీనికోసం విదేశీ నిపుణులను రంగంలోకి దింపింది.. ఇక, ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు రెండు రోజుల నుంచి విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తోంది. గత రెండు రోజులపాటు పోలవరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను పరిశీలించిన బృందం మూడవ రోజు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణులబృందం మూడో రోజు డీ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని రాతిని పరిశీలించారు. మరిన్ని నమూనాల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది.
Read Also: Bhadradri Kothagudem: అధికారులు వేధిస్తున్నారు.. ఆసుపత్రి భవనం ఎక్కిన యువకులు..
ఇక, ఈరోజు, రేపు ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు వివరాలు సేకరించిన అనంతరం నిపుణుల బృందం తుది నివేదికను అందించనుంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించి ఎగువ , దిగువ కాపర్ డ్యాం, డి వాల్, పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న బృందం ఆయా పనులకు సంబంధించిన వివరాలను జల వనరుల శాఖ అధికారుల నుండి సేకరిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు పనులపై ఆరా తీశారు.. ఇబ్బందులు, ప్రాజెక్టులో లోపాలు.. తదితర అంశాలపై దృష్టిపెట్టారు.. ఆ తర్వాత విదేశీ నిపుణులను రంగంలోకి దింపిన విషయం విదితమే.