ఆదివారం ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగింది. ఇందులో 50కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా.. ముఖ్య అతిథిగా నటి శ్రీముఖి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియచేస్తూ.. తనను కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్ధులు ప్రయత్నిస్తూ యూనివర్సిటీలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారని.. అటువంటి విద్యార్థులకు ఈ ఫెయిర్ ఒక మంచి అవకాశం అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్లా వారిని కొనియాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్ లో నిర్వహించాలని ఆకాంక్షించారు.
Pushkar Singh Dhami: పోలీసులు సజీవ దహనానికి ప్రయత్నించారు.. వారిని వదిలిపెట్టేది లేదు..
అనంతరం సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ.. ఉన్నతమైన విశ్వ విద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్ కు మంచి పునాదిని వేసుకోగలరని, తద్వారా మంచి భవిష్యత్ ను సొంతం చేసుకోగలరని వివరిస్తూ ఫెయిర్ కి విచ్చేసినందుకు శ్రీముఖికి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించలేని పేద విద్యార్థులకు తమ అరసవిల్లి అరవింద్ చారిటటుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఫెయిర్ లో 500 లకు పైగా విద్యార్థులు పాల్గొని తమకున్న సందేహాలను తీర్చుకోగా, ఫెయిర్ నిర్వహించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Aishwarya Rajinikanth: ధనుష్ తో విడాకులు.. రెండేళ్ల నుంచి సేఫ్ గా ఉన్నా
