పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్స్ వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉస్తాద్ కు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 27 లేదా ఏప్రిల్ 30 తేదీల్లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
వినిపిస్తున్న సమాచారం మేరకు, ఏప్రిల్ 30వ తేదీనే ఎక్కువగా ఫైనల్ రిలీజ్ డేట్‌గా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు తగ్గట్టుగా భారీ ఓపెనింగ్స్ ఉండే ఛాన్స్ ఉందని మేకర్స్ ఏప్రిల్ డేట్ కు రిలీజ్ చేసే ఉద్దేశంతో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ తో ఇటీవల వేసిన సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కు నచ్చిన ఎలా చేయాలో హరీష్ శంకర్ కు బాగా తెలుసు. అందుకు తగ్గట్టే ఉస్తాద్ ని రెడీ చేస్తున్నాడు. మరి అనుకున్న డేట్ కు వస్తారా లేదా పెద్ది రిలీజ్ వాయిదా వేస్తె మార్చికి వస్తారా అనేది త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ వస్తుందేమో చూడాలి.
