Site icon NTV Telugu

Republic Day: జనవరి 26 వెనుక ఆసక్తికరమైన హిస్టరీ..

Republic Day

Republic Day

Republic Day: మరో రెండు రోజుల్లో యావత్ దేశం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోడానికి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో మీలో ఎంత మందికి జనవరి 26 వెనుక ఉన్న ఆసక్తికరమైన హిస్టరీ తెలుసు. ఇంతకీ యావత్ భారతావనీ జనవరి 26నే రిపబ్లిక్ డే వేడుకలు ఎందుకు నిర్వహిస్తుంది, నిజానికి నవంబర్ 26, 1949నే రాజ్యాంగ సభ భారత రాజ్యాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, దానిని అమలు చేయడానికి టైం ఎందుకు తీసుకున్నారు. సంవత్సరంలో ఎన్నో రోజులు, నెలలు ఉండగా జనవరి 26 తేదీనే ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? ఈ స్టోరీలో సమాధానాలు తెలుసుకుందాం.

READ ALSO: 2026 Mega Summer: థియేటర్లలో దండయాత్రకు సిద్ధమైన మెగా హీరోలు!

జనవరి 26 కోసం ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత దేశానికి 1947 ఆగస్ట్​ 15న స్వాతంత్ర్యం లభించింది. ఈ క్రమంలో ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని చాలా మంది పెద్దలు ఆలోచించారు. ఈ ఆలోచనలను ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి ఆగస్టు చివర్లో డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.. రాజ్యాంగ రచనకు ఈ కమిటీ ఎంతో కృషి చేసింది. ఈ కమిటీకి భారత రాజ్యాంగ రచనకు 2ఏళ్ల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. 1949 నవంబర్​ 26న రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. అయితే రాజ్యాంగ సభ ఆమోదం పొందిన వెంటనే ఈ రాజ్యాంగం అమల్లోకి రాలేదు.

కొన్ని సర్దుబాట్లు చేసుకొని రెండు నెలలకు అంటే జనవరి 26 న అమల్లోకి తీసుకొచ్చారు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలకుల కబంద హస్తాల నుంచి భారతావని విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో జనవరి 26కు విశేష ప్రాముఖ్యత ఉంది. 1930 జనవరి 26న.. తొలిసారిగా పూర్ణ స్వరాజ్​ (సంపూర్ణ స్వాతంత్ర్యం) నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్​. దేశ చరిత్రలో అదొక కీలక ఘట్టంగా భావిస్తూ ఉంటారు.. ఆ తర్వాత 20 ఏళ్లకు జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ తేదీని పురష్కరించుకుని ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

READ ALSO: Mini Projectors: ఇక సినిమా హాళ్లకు వెళ్లనవసరం లేదు.. ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్!

Exit mobile version