NTV Telugu Site icon

Manchu Family: మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికర అంశాలు

Maunika Manoj

Maunika Manoj

మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై లో ఉన్న ఓ టాయ్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు మౌనిక- మనోజ్ దంపతులు సిద్ధమయ్యారు. మనోజ్ కి వ్యాపారం చేయడం తెలియదని మోహన్ బాబు కంపెనీ కొనుగోలుకు నిరాకరించారు. ఇప్పటికే పలు వ్యసనాలకు అలవాటు పడ్డారని మోహన్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మౌనిక- మనోజ్ దంపతులను జల్‌పల్లి ఇంట్లోనే ఉండాలని చెప్పారు. వ్యాపారంతో పాటు రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచనలో ఆస్తి వాటా కోసం మంచు ఇంట్లో వివాదం మొదలైంది. మామా కోడళ్ల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.

READ MORE: Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఇండియా బ్లాక్ నిరసన.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాహుల్ త్రివర్ణ పతకం అందజేత!

ఆస్తులు పంపకం చేయాలని మోహన్ బాబుపై మౌనిక దంపతులు ఒత్తిడి తెచ్చారు. మంచు ఇంట్లో గత 6 నెలలుగా ఆస్తుల పంపక‌ంపై రచ్చ కొనసాగుతోంది. ఇప్పటికే మనోజ్ పలు బ్యాంకుల్లో కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నట్లు సమాచారం. ఆస్తి పేపర్లు తనఖా పెట్టినట్లు తెలుస్తోంది. మౌనిక- మనోజ్ ల పెళ్లి నుంచే తండ్రికొడుకుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

READ MORE:Manchu Manoj: జల్‌పల్లి నివాసం ముందు మీడియా ప్రతినిధుల ఆందోళన.. మద్దతు తెలిపిన మనోజ్

Show comments