Oscars: ఆస్కార్ ముచ్చట్లు.. 3.8 కేజీల బరువు.. 500 కోట్ల ఖర్చు! ఆస్కార్ వెనకున్న క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oscars: వెండితెర నటీనటుల చిరకాల స్వప్నం.. ప్రపంచ సినీ యవనికపై అత్యున్నత గౌరవం.. అదే ‘ఆస్కార్’. ఏటా అట్టహాసంగా జరిగే ఈ వేడుక వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర, మరెన్నో ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఆస్కార్ అసలు పేరు దగ్గరి నుంచి అది జరిగే థియేటర్ వరకు ఆ అవాక్కయ్యే విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
1. మనం పిలుచుకునే ‘ఆస్కార్’ అనేది అధికారిక పేరు కాదు. దీని అసలు పేరు ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’. అకాడమీ లైబ్రేరియన్‌గా పనిచేసిన మార్గరెట్ హెరిక్.. ఈ విగ్రహాన్ని చూసి “ఇది అచ్చం మా బాబాయ్ ఆస్కార్ లాగే ఉంది” అని సరదాగా అన్నారట. కాలక్రమేణా ఆ పేరే స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
2. చూడటానికి మెరిసిపోయే ఆ బంగారు బొమ్మ అంత తేలికైనదేం కాదు. ఇది సుమారు 3.8 కేజీల (8.5 పౌండ్లు) బరువు, 13.5 అంగుళాల పొడవు ఉంటుంది. గెలిచిన ఆనందంలో నటీనటులు దీనిని ఒక చేత్తో ఎత్తేస్తుంటారు కానీ, పట్టుకోవడం అంత సులభం కాదు.
3. ఆస్కార్ ట్రోఫీ విలువ వెలకట్టలేనిది. కానీ, దానిని అమ్మడంపై కఠినమైన నిషేధం ఉంది. 1951 నిబంధన ప్రకారం.. విజేతలు లేదా వారి వారసులు ఆ అవార్డును వదులుకోవాలనుకుంటే, దానిని తిరిగి అకాడమీకే ఇచ్చేయాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అకాడమీ దానికి ప్రతిఫలంగా కేవలం ఒక్క డాలర్ మాత్రమే చెల్లిస్తుంది.
4. సాధారణంగా విజేతలకు ప్రసంగించడానికి 45 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. అయితే, గ్రీర్ గార్సన్ 5 నిమిషాల 30 సెకన్ల పాటు మాట్లాడి రికార్డు సృష్టించగా.. 2025లో అడ్రియన్ బ్రాడీ ఏకంగా 5 నిమిషాల 40 సెకన్ల పాటు ప్రసంగించి ఆ రికార్డును తిరగరాశారు.
5. వాల్ట్ డిస్నీ అత్యధికంగా 26 ఆస్కార్లను గెలుచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ‘బెన్-హుర్’, ‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చిత్రాలు ఒక్కొక్కటి 11 అవార్డులతో చరిత్ర సృష్టించాయి. ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ గెలిచిన మొదటి మహిళగా కేథరిన్ బిగెలో (2010) రికార్డుకెక్కారు.
6. ఆస్కార్ వేడుకల నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. ఒక్క రాత్రి జరిగే ఈ ఈవెంట్ కోసం అకాడమీ సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా. రెడ్ కార్పెట్, లైటింగ్, నామినీ కార్డుల ప్రింటింగ్ నుంచి అతిథుల విందు వరకు అంతా అత్యంత విలాసవంతంగా ఉంటుంది.
2002 నుంచి లాస్ ఏంజెలెస్‌లోని ‘డాల్బీ థియేటర్’ ఆస్కార్ వేడుకలకు శాశ్వత చిరునామాగా మారింది. నటీనటుల కలల వేదికైన ఈ థియేటర్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది.
READ ALSO: B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!