NTV Telugu Site icon

Vijayashanthi: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ పై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vijayashanthi

Vijayashanthi

తెలంగాణలో కమలం పార్టీలో​ ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక నేతల మధ్య విభేదాల కారణంగా అధిష్టానం బీజేపీ నేతలతో భేటీ అయింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Read Also: France: ఫ్రాన్స్‌లో ఆగని అల్లర్లు.. పారిస్‌ శివారులో కర్ఫ్యూ విధింపు

తాజాగా విజయశాంతి.. తన ట్విట్టర్ అకౌంట్ లో రాజాసింగ్ సస్పెన్షన్‌పై సంచలన పోస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని ఆమె తెలిపారు. అయితే, బండి సంజయ్ తో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నామని విజయశాంతి వెల్లడించింది. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా.. సరైన సమయంలో అంతా మంచే జరుగుతుంది అని ఆమె ట్విట్టర్ పోస్ట్ లో రాసుకొచ్చారు.

Read Also: Shop Tab on Android TV: గూగుల్ కొత్త ఫీచర్.. స్మార్ట్ టీవీలో షాపింగ్ ట్యాబ్!

కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచిగానే వస్తుందని అప్పటి వరకు అందరు వేచి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇక, విజయశాంతి చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక విజయశాంతి ట్విట్ పై బీజేపీ కార్యకర్తలు రాజాసింగ్ సస్పెన్షన్‌పై స్పందిస్తున్నారు.

Show comments