Site icon NTV Telugu

Vijayawada: హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య..! కుటుంబ సభ్యుల అనుమానం..

Suicide

Suicide

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు విడుదలైన తర్వాత.. ఫెయిల్‌ అయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా, విజయవాడలోని తాడిగడప కాలేజీ చైతన్య హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది.. నిన్న హాస్టల్‌లో ఊరివేసుకుని ఇంటర్ విద్యార్థిని వాణి ఆత్మహత్య చేసుకుంది.. ఇంటర్‌లో ఒక్క సబ్జేక్ట్‌ ఫెయిల్ కావడంతో ఇతర విద్యార్థుల ముందు లెక్చరర్‌ మందలించారట.. తోటి విద్యార్థుల ముందు లెక్చరర్‌ వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.. అయితే, కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు.. వాణి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఆత్మహత్య చేసుకున్న గది వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు.. వాణి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం మార్చిలో మృతదేహాన్ని ఉంచారు.. కాగా, పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకే.. ఆత్మ విశ్వాసం కోల్పోయి ఇలా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది..

Read Also: Janhvi Kapoor : వేడుకలో జిప్ చిరిగిపోయి ఇబ్బందిపడ్డారట జాన్వీ

Exit mobile version