Site icon NTV Telugu

Inter Student: కామాంధుడిగా మారిన ఇంటర్ విద్యార్థి.. ప్రేమ పేరుతో ముగ్గురు అమ్మాయిలను ఇలా..

Junior

Junior

ఒక ఇంటర్ విద్యార్థి.. ముగ్గురు తోటి విద్యార్థినులను ప్రేమ పేరుతో వంచించాడు. వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ శారీరక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఓ బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇంటర్ విద్యార్థిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి.. కామాంధుడిగా మారాడు. తన తోటి విద్యార్థినులను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. అలా ముగ్గురు అమ్మాయిలకు వలపు వల విసిరాడు. అంతే కాకుండా వారితో లైంగిక వాంఛ తీర్చుకుని వారి జీవితాలను ఆగమాగం చేశాడు. పైగా ఆ తతంగాన్ని అంతా తన మొబైల్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూపించి ముగ్గురు బాలికలను బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానన్నాడు. వాళ్ల తల్లిదండ్రులకు కూడా పంపిస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు కామాంధుడి టార్చర్ ఎక్కువ కావడంతో ఆ విద్యార్థినులు తట్టుకోలేకపోయారు.

Also Read:Fake Rank: UPSCలో ర్యాంక్ సాధించానన్నాడు.. ఎమ్మెల్యే, పోలీసులు ఘనంగా సన్మానం.. కట్ చేస్తే అంతా ఫేక్..

గర్భం దాల్చిన విద్యార్థిని..
పాపం ఆ విద్యార్థినులు కూడా చాలా రోజులు.. అతడి ఆగడాలను భరించారు. రమ్మన్న చోటికల్లా వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని గర్భం దాల్చింది. దీంతో ఆమెను కొల్లాపూర్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడే ఓ డాక్టర్, నర్స్ సాయంతో అబార్షన్ చేయించాడు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు. ఐతే అదే సమయంలో మరో విద్యార్థిని.. ఆ కామాంధుడి ఆగడాలను భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఒక్కసారిగా ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతని కోసం వెతికారు. అప్పుడే అబార్షన్ ప్రక్రియ పూర్తి చేసి బయటకు వచ్చి విద్యార్థినితో ఉన్న అతన్ని పట్టుకున్నారు బాలిక పేరెంట్స్. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Also Read:AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు.. మరో పథకం అందుబాటులోకి..

ఫోన్‌లో 8 మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఫోటోలు, వీడియోలు..
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో అతని ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఫోన్‌లో 8 మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఫోటోలు, వీడియోలు ఉన్నట్లుగా నిర్ధారించారు. అందరితోనూ లైంగిక సంబంధాల సందర్భంగా తీసిన ప్రయివేట్ వీడియోలను పోలీసులు గమనించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. మరోవైపు బాలికకు అబార్షన్ చేసిన ఘటనలో ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్, నర్స్‌ను కూడా అరెస్ట్ చేశారు. వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

Exit mobile version