NTV Telugu Site icon

Mass Maharaja Raviteja: ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

Ravanasura Glimpse

Ravanasura Glimpse

Mass Maharaja Raviteja: మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్‌లో పెట్టారు రవితేజ. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అభిమానులు ఇప్పుడు రవితేజ రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ‘రావణాసుర’ ఒకటి కావడం గమనార్హం. మాస్‌ మహారాజా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర. యూనిక్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.

రవితేజ పుట్టినరోజు నేపథ్యంలో ఈ అప్డేట్‌ను ఇచ్చారు. కాగా ఈ ఏడాది అంటే ఏప్రిల్ ఏడో తేదీన 2023లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ‘రావణాసుర’ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ జీ నెట్‌వర్క్‌కి భారీ ధరకు అమ్ముడయ్యాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 వద్ద ఉండగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ కథానాయికలుగా నటించారు. సుశాంత్ ప్రతినాయకుడు కాగా, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Ravanasura: ‘రావణాసుర’ పోస్ట్ థియేట్రికల్ రైట్స్‌కు ఊహించని బిజినెస్

అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7, 2023న విడుదల కానుంది, దీనికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. రవితేజ మరోవైపు పాన్‌ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్‌ రావులో కూడా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా బయటకు వచ్చింది.

 

Show comments