NTV Telugu Site icon

CM YS Jagan in Danger: సీఎం జగన్‌కు పొంచువున్న ముప్పు..! ఇంటెలిజెన్స్ నివేదిక

Special Helicopters

Special Helicopters

CM YS Jagan in Danger: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రమాదం పొంచిఉందని ఇంటెలిజెన్స్‌ హెచ్చరిస్తోంది.. దీంతో.. సీఎం కోసం రెండు హెలీకాప్టర్లు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.. సీఎం జగన్ పర్యటనల నిమిత్తం రెండు ప్రత్యేక హెలీకాప్టర్లను రెడీ చేస్తున్నారు.. విజయవాడ, విశాఖల్లో రెండు హెలీకాప్టర్లను అందుబాటులో ఉంచనుంది ప్రభుత్వం.. లీజు ప్రాతిపదికన సీఎం జగన్‌కు హెలీకాప్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.. మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా హెలికాప్టర్స్ అనే సంస్థ నుంచి హెలీకాప్టర్లను లీజుకు తీసుకుంది ప్రభుత్వం.. రెండు ఇంజిన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లను లీజుకు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్ల చొప్పున లీజు చెల్లించనున్నారు.. ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా హెలికాప్టర్లను లీజుకు తీసుకున్నారు.. ఎయిర్ పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, పైలట్ల బస, రవాణా, ఇంధన రవాణా, హెలికాప్టర్ క్రూ వైద్య ఖర్చులు వంటి వాటికి గంటల ప్రాతిపదికన ఏటీసీ ఛార్జీల చెల్లింపులకు నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Srisailam Temple Trust: టీటీడీ తరహాలో శ్రీశైలానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి.. ట్రస్ట్‌ బోర్డ్‌ తీర్మానం..

ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని నిర్ధారించిన ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్. ముఖ్యమంత్రితో పాటు వీవీఐపీల ప్రయాణం కోసం రెండు హెలికాప్టర్లు అవసరమని భావించింది.. సీఎం జగన్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున వివిధ అంశాలను సున్నితంగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు ఇంటెలిజెన్స్ డీజీపీ. సీఎం జగన్‌కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగ్‌లు, సంఘ విద్రోహశక్తుల నుంచి ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చారు ఇంటెలిజెన్స్ డీజీపీ. సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉన్నందున ప్రయాణాల్లో సునిశితంగా వ్యవహరించాల్సి ఉందని వెల్లడించారు.

Read Also: CM YS Jagan Ongole Tour: రేపు ఒంగోలుకు వైఎస్‌ జగన్‌.. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ

ప్రస్తుతం ఉపయోగిస్తున్న భెల్ హెలికాప్టర్ 2010 నుంచి వినియోగిస్తున్నారన్న ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌… ప్రస్తుత హెలీకాప్టరును తక్షణం మార్పు చేయాలని పేర్కొంది.. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణాలకు అత్యాధునిక రెండు భెల్ హెలికాప్టర్లను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్.యువరాజ్.