Onion Pickle Recipe: క్షణాల్లో ఉల్లిపాయ పచ్చడి రెడీ.. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ అడుగుతారు అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Pickle Recipe: వేసవి కాలంలో వంటగదిలో ఎక్కువసేపు గడపడం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వేడి కారణంగా ఆకలి తగ్గిపోవడంతో తేలికగా, త్వరగా తయారయ్యే రుచికరమైన వంటకాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. అలాంటి సమయంలో కేవలం కొన్ని నిమిషాల్లో సిద్ధమయ్యే ఉల్లిపాయ పచ్చడి మంచి ఎంపికగా నిలుస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే.. పాత రొట్టె, పరాటా కూడా రాజభోజనంలా అనిపిస్తుంది.
మామిడి, నిమ్మకాయ, ఇంగువ వంటి పచ్చళ్లు చాలా మందికి తెలిసినవే. కానీ ఉల్లిపాయతో కూడా అద్భుతమైన పచ్చడి తయారు చేసుకోవచ్చని చాలామందికి తెలియదు. కారంగా, పుల్లగా ఉండే ఈ పచ్చడి సాదాసీదా భోజనానికే కొత్త రుచి తీసుకొస్తుంది.
Also Read
- New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
- WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
- Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
- Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
కావలసిన పదార్థాలు
* పెద్ద ఉల్లిపాయలు – 4 నుంచి 5 (సన్నగా తరిగినవి)
* పచ్చిమిరపకాయలు – 7 నుంచి 8 (నిలువుగా కోసినవి)
* ఎర్ర కారం పొడి – 2 టీస్పూన్లు
* పసుపు పొడి – 1 టీస్పూన్
* జీలకర్ర పొడి – అర టీస్పూన్
* సోంపు గింజలు – 1 టేబుల్ స్పూన్
* ఆమ్చూర్ పొడి – 1 టీస్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
తాలింపుకు కావాల్సినవి
* ఆవ నూనె – 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు
* నల్ల జీలకర్ర – 1 టీస్పూన్
* ఆవాలు – అర టీస్పూన్
* ఇంగువ – చిటికెడు
తయారీ విధానం
మొదట ఒక పెద్ద గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో ఎర్ర కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, సోంపు గింజలు, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న బాణలిలో ఆవ నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత నల్ల జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు సిద్ధం చేయాలి. ఆవాలు చిటపటలాడిన వెంటనే ఆ వేడి తాలింపును ఉల్లిపాయ మిశ్రమంపై పోయాలి. తర్వాత చేతులతో లేదా చెంచాతో బాగా కలపాలి. దీంతో మసాలాలు, నూనె ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టి అద్భుతమైన రుచి వస్తుంది.
నిల్వ చిట్కాలు
ఈ పచ్చడిని వెంటనే తినవచ్చు. అయితే ఒకటి లేదా రెండు గంటలు ఉంచితే మసాలా ఉల్లిపాయల్లో బాగా కలసి రుచి మరింత పెరుగుతుంది. నెల రోజుల వరకు నిల్వ ఉంచాలనుకుంటే రెండు టీస్పూన్ల తెల్ల వెనిగర్ కలపాలి. వెనిగర్ వేయకపోయినా ఫ్రిజ్‌లో 10 నుంచి 15 రోజుల వరకు తాజాగా ఉంటుంది.
తింటే మరిచిపోలేరు
ఇంట్లో కూర లేకపోయినా, మిగిలిపోయిన రొట్టెలు ఉన్నా, ఈ ఉల్లిపాయ పచ్చడి ఉంటే చాలు. సాధారణ భోజనం కూడా ప్రత్యేక విందుగా మారిపోతుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే రుచితో ఇది మీ ఫేవరెట్ అవుతుంది.
తాజావార్తలు
-
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
YSRCP : స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
ట్రెండింగ్
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!