NTV Telugu Site icon

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్.. రీల్స్ కూడా..

Insta

Insta

సోషల్ మీడియా యాప్ లలో పాపులారిటిని సంపాదించుకొనే యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ మొదటి స్థానంలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… యువత ఎక్కువగా ఈ యాప్ ను వాడుతున్నారు.. ప్రైవసీ తో పాటు ఫీచర్స్ కూడా ఆకట్టుకోవడంతో ఎక్కువ మంచి ఈ యాప్ ను వాడుతున్నారు.. అందుకే తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్లు ఇన్‌స్టా స్టోరీలకు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఇన్‌స్టా స్టోరీలు ఇంతలా పాపులర్‌ కావడానికి ప్రధాన కారణం పాటల లిరిక్స్‌ను యాడ్ చేసే ఫీచర్‌ ఉండడమే. స్టోరీలకు పాటల లిరిక్స్‌ను జోడించుకునే ఫీచర్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌ను రీల్స్‌కు కూడా యాడ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ను అందిస్తుంది..

ఈ విషయాన్ని స్వయంగా మెటా అధినేత తెలిపారు.. రీల్స్‌లోని పాటలకు లిరిక్స్‌ యాడ్ చేసుకోవాలంటే మనమే స్వయంగా టైప్‌ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై అవసరం ఉండని జుకర్‌ బర్గ్ తెలిపారు. రీల్స్‌కు భారీగా ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు..ఇక ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ క్రియేట్ చేసి మ్యూజిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి, మీకు కావాల్సిన పాటను సెలక్ట్ చేసకొని.. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయగానే లిరిక్స్ వీడియోకు యాడ్ అవుతుంది.. ఈ ఫీచర్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..