Instagram and Facebook Outage: మంగళవారం (డిసెంబర్ 23)న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య ప్రధానంగా అమెరికాలోని వినియోగదారులను ప్రభావితం చేసింది. ఇందుకు సంబంధించి Downdetector వెబ్‌సైట్‌లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ (మెటా సంస్థకు చెందినవి) సాధారణంగా పనిచేస్తున్నాయి. అంతరాయం ప్రధానంగా అమెరికాకే పరిమితమై ఉన్నట్లుగా సమాచారం.
India-New Zealand: భారత్‌తో ఒప్పందాన్ని తప్పుపట్టిన న్యూజిలాండ్ మంత్రి.. ‘బ్యాడ్ డీల్’ అంటూ అభ్యంతరం
Downdetector డేటా ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల్లో 49 శాతం మంది యాప్ పనిచేయడం లేదని, 31 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు ఎదుర్కొన్నామని, మిగిలిన 20 శాతం మంది లాగిన్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ఫేస్‌బుక్ విషయంలో 54 శాతం మంది వెబ్‌సైట్‌కు సంబంధించి సమస్యలు ఎదుర్కొనగా, 31 శాతం మంది యాప్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిగిలిన 15 శాతం మంది లాగిన్ సమస్యలను నివేదించారు. ఈ అంతరాయం లాస్ ఏంజెలెస్, న్యూయార్క్, చికాగో, బోస్టన్ వంటి అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఎక్కువగా ప్రభావం చూపింది.
Brutal Murder: దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపి.. గ్రైండర్ లో రుబ్బి..
అయితే, మెటా సంస్థ ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి Downdetector లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు సంబంధించి నమోదవుతున్న ఫిర్యాదుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
