NTV Telugu Site icon

Inspector Rishi OTT: ఓటీటీలోకి వచ్చేసిన నవీన్ చంద్ర హారర్ క్రైమ్ థ్రిల్లర్..!

5

5

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా హీరోగా నవీన్ చంద్ర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా తన నటన ప్రావిణాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇక సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా అందాల రాక్షసి తో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనేక పాత్రలలో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అందాల రాక్షసి సినిమా నే కెరియర్ బెస్ట్ గా నిలిచింది. ఇక గత సంవత్సరం హీరోయిన్ కలర్స్ స్వాతి తో కలిసి చేసిన మంత్ ఆఫ్ మధు కూడా బాగానే ఆకట్టుకుంది. సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మంచి రెస్పాన్స్ బాగా ఉన్న.. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక మరింత రెస్పాన్స్ ఈ సినిమాకి వచ్చింది.

Also read: Hunger Crisis : ప్రతేడాది 80కోట్లమందికి సరిపోయే ఆహారం వృధా

ఇకపోతే ప్రస్తుతం నవీన్ చంద్ర సినిమాలతో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ లతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అమ్ము, రిపీట్ సినిమాలతో పాటు పరంపర వెబ్ సిరీస్ లను చేసి ప్రేక్షకులను అలరించాడు. నవీన్ చంద్ర నటించిన పరంపర సిరీస్ ఆయన ఒక మంచి పేరు తీసుకొచ్చింది. రెండు సీజన్లు పూర్తి చేసిన నవీన్ చంద్ర కెరియర్లో మంచి సీరిస్ గా నిలిచింది. అయితే ఇప్పుడు వాటికి మించి కాస్త భిన్నంగా కొత్తగా అందరికీ గుర్తుండిపోయే సేరిస్తో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నవీన్ చంద్ర. మామూలుగా హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. అలాంటి సినిమాలకు కాస్త క్రైమ్ కూడా జతపరిస్తే ఫుల్ సెన్సేషన్ గ్యారెంటీ.

Also read: Allu Arjun : తన విగ్రహంతో అల్లు అర్జున్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇందులో భాగంగానే నవీన్ చంద్ర తాజాగా నటించిన హర్రర్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి. ఈ సిరీస్ నేటి నుంచి మార్చి 29 శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ 30 నుంచి 60 నిమిషాల మధ్యలో ఉంది. ఈ వెబ్ సిరీస్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ సంబంధించి ఇదివరకే విడుదలైన ట్రైలర్ అందరిని భయపెట్టింది. చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ తో నవీన్ చంద్ర మరో సైన్సేషన్ క్రియేట్ చేస్తాడో లేదో.

Show comments