NTV Telugu Site icon

Yadadri Thermal Power Plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై ఎంక్వైరీ స్పీడప్

Yadadri Thermal Power Plant

Yadadri Thermal Power Plant

Yadadri Thermal Power Plant: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ చేపట్టింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సమావేశమయ్యారు. థర్మల్ పవర్ ప్లాంట్‌లోకి మీడియాను అధికారులు అనుమతించలేదు.

Read Also: CM Revanth Reddy: రాష్ట్ర దశాబ్ది వేడుకలు.. గవర్నర్ కు సీఎం రేవంత్ ఆహ్యానం

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి టెండర్లు ఎందుకు పిలవలేదో విచారణ జరిపామని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విచారణ కమిటీ చీఫ్ జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం టెండర్లు ప్రకటించకుండా బీహెచ్‌ఈఎల్‌కు కేటాయించడంపై విచారణ చేశామన్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై కూడా విచారణ జరుగుతుందన్నారు. భద్రాద్రి, యాదాద్రి, పీపీఏల వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాల వెనక భాగస్వాములైన వారందరికీ నోటీసులు ఇచ్చామన్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకునేందుకు నోటీసులు ఇచ్చామన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలింగ్ తర్వాత నోటీసులు ఇచ్చామన్నారు. అయినప్పటికీ నోటీసులకు మంచి స్పందన వచ్చిందన్నారు. చాలామంది వారి అభిప్రాయాలను మాకు చెప్పారని.. ప్రభుత్వ నిర్దేశించిన సమయంలోపే రిపోర్టు అందజేస్తామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆగస్టులో మొదటి యూనిట్, సెప్టెంబర్‌లో రెండవ యూనిట్.. ఆరు నెలల తర్వాత మిగిలిన యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు చెప్పారని ఆయన వెల్లడించారు.

Show comments