Site icon NTV Telugu

Inox Credit Card: సినీప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఐనాక్స్‌ స్పెషల్ క్రెడిట్ కార్డు..

Inox

Inox

ఈరోజుల్లో టెక్నాలజీ కాలంతో పాటు పరుగులు పెడుతుంది.. గతంలో సినిమాను చూడాలంటే హాల్స్ కు వెళ్ళాలి.. ఇప్పుడు మల్టీ ఫ్లెక్స్ లు అందుబాటులోకి రావడంతో అన్ని ఆన్లైన్లో నే జరుగుతున్నాయి.. కొన్ని మల్టీనేషనల్‌ కంపెనీలు మల్టీప్లెక్స్‌ మార్కెట్‌లోకి రావడంతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా భారతీయ మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్‌ ఐనాక్స్ సహకారంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ పీవీఆర్‌ ఐనాక్స్ క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకొని రాబోతుంది.. ఈ క్రెడిట్ కార్డును ఎలా పొందాలి? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి సినిమాను బుక్ చేసుకున్న ప్రతి టిక్కెట్‌పై 5 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ కార్డ్ విలాసవంతమైన టిక్ అనుభవం కోసం పీవీఆర్‌ ఐనాక్స్‌లో ప్రీమియం లాంజ్ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు..

రూ. 10,000 ఖర్చు చేయడం ద్వారా కార్డు హోల్డర్‌కు రూ. 300 విలువైన ఒక పీవీఆర్‌ ఐనాక్స్ మూవీ టిక్కెట్‌ను సంపాదించవచ్చు. రివార్డ్ స్ట్రక్చర్ వ్యయం ఆధారంగా పెరుగుతుంది.. ఖర్చు పెట్టే కొద్ది రివార్డ్స్ కూడా పెరుగుతాయి..

ఇకపోతే పీవీఆర్‌ ఐనాక్స్ ప్రాంగణంలో ఫుడ్ మరియు డ్రింక్స్ ను కొనుగోలు చేసేవారికి 20% తగ్గింపు కూడా ఉంటుంది.. అదనంగా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి బుక్ చేసుకున్న ప్రతి టిక్కెట్‌పై 5 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ కార్డ్ విలాసవంతమైన టిక్ అనుభవం కోసం పీవీఆర్‌ ఐనాక్స్‌లో ప్రీమియం లాంజ్ యాక్సెస్‌ను కూడా మంజూరు చేస్తుంది..

ఈ బ్యాంక్ ట్యాప్-అండ్-పే పద్ధతితో డబ్బులను చెల్లించేందుకు అనుమతిని ఇస్తుంది.. పిన్ అవసరం లేకుండా రూ. 5,000 వరకు లావాదేవీలను సులభతరం చేయడం ద్వారా సౌలభ్యాన్ని పెంచుతుంది.. ఇకపోతే ఈ కార్డు జీరో ప్రాసెసింగ్‌ ఫీజుతో వస్తుంది. ఇది విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. కోటక్ పీవీఆర్‌ ఐనాక్స్ క్రెడిట్ కార్డు కోసం ఏడాదికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..

Exit mobile version