NTV Telugu Site icon

CYGNUS Gastro Hospitals: సిగ్నస్‌ గ్యాస్ట్రో హాస్పిటల్‌లో వినూత్నమైన శస్త్రచికిత్స

Cygnus Gastro

Cygnus Gastro

CYGNUS Gastro Hospitals: హైదరాబాద్‌లోని నిజాంపేట్ ఎక్స్ రోడ్‌లో ఉన్నటువంటి సిగ్నస్ గ్యాస్ట్రో హాస్పిటల్ నందు అరుదైన క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు హాస్పిటల్ వైద్యనిపుణులు, యాజమాన్యం ప్రకటించింది. 32 ఏళ్లు వయస్సు గల వ్యక్తికి ఆహారం, నీరు తీసుకోవడమే కష్టమే మారడంతో సిగ్నల్ గ్యాస్ట్రో ఆస్పత్రికి రాగా.. ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తర్వాత ఎగువ అన్నవాహిక క్యాన్సర్‌గా గుర్తించారు. 3 నెలలపాటు కీమోథెరఫీ, రేడియోథెరఫీ అందించి క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా అరికట్టి, తిరిగి పరీక్షలు నిర్వహించి ఒక క్లిష్టమైన లారింగో ఫారింగో ఈసోఫేజిక్టమితో ఫారింగో గ్యాస్టిక్ అనస్టామోసిస్, పర్మనెంట్ ట్రాకియాసోమి అనే సర్జరీని నలుగురు వైద్యనిపుణులు 10 గంటలపాటు శ్రమించి విజయవంతంగా సర్జరీని పూర్తిచేశారు.

10 రోజులపాటు హాస్పిటల్లో నిరంతరంగా చికిత్స అందిస్తూ పూర్తిగా కోలుకున్న తరువాత డిశ్చార్జ్ చేశామని వైద్యులు వెల్లడించారు. 6 నెలలపాటు రెగ్యులర్‌గా వైద్యపర్యవేక్షణలో ఉంచి ప్రస్తుతం పేషెంట్ క్యాన్సర్ రహిత సాధారణ స్థితికి చేరుకున్నాడని, త్వరలో వాయిస్ బాక్స్ ఇంప్లాంటేషన్ జరపనున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సీఈఓ & ఎండీ డాక్టర్ వేణు, చీఫ్ గాస్ట్రోఎంట్రాలజిస్ట్, చీఫ్ సర్జన్ డాక్టర్ నవీన్, డాక్టర్ వరుణ్, డాక్టర్ అచ్యుత్, డాక్టర్ ముర్తజా, పేషెంట్, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.