Site icon NTV Telugu

Infosys Co-Founder: అన్ని రంగాల్లోనూ భారత్ విలువైన దేశంగా ఎదగాలి..

Infosys

Infosys

Infosys Co-Founder: గరీభీ హఠావో అనే నినాదాలతో పేదరికం దూరం కాదని.. నిరంతర శ్రమ, ఆలోచనలు, ఆవిష్కరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బాల్యంలో తన సెలవులను ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని సీదలాగుట్టలో గడిపానని గుర్తు చేసుకున్నారు. తెలుగు మాట్లాడలేను కానీ బాగా అర్థం చేసుకోగలనన్నారు. మాయాబజార్, దేవదాస్, పెళ్లి చేసి చూడు వంటి సినిమాలను వీధి తెరపై చూసిన అనుభవం ఉందన్నారు.

Indian Economy: రెండేళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌..

45శాతం మంది రైతులు ఉన్న ఇండియా జీడీపీలో వాళ్ల భాగస్వామ్యం తక్కువగా ఉందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే యూఎస్, యూకేల్లో భారతీయులు ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అన్ని రంగాల్లోనూ భారత్ విలువైన దేశంగా ఎదగాలన్నారు. ఒకప్పుడు అవమానించబడ్డ స్థాయి నుంచి జీ 20 సమావేశాలకు ప్రాతినిధ్యం వహించే వరకు ఎదిగామని గర్వంగా చెప్పారు. యూనివర్సిటీలు విజ్ఞాన కేంద్రాలుగా మిగిలిపోకుండా చోదక శక్తిగా ఎదగాలన్నారు.

Exit mobile version