మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఆసియా కప్ 2025లో పురుషుల జట్టు మాదిరే.. ఈ మ్యాచ్‌లోనూ మహిళలు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగిన భారత మహిళలు.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటుతున్నారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాక్ ఐదు కీలక వికెట్స్ కోల్పోయి పరాజయం దిశగా సాగుతోంది. పాక్ 31 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి 102 రన్స్ చేసింది. విజయానికి 19 ఓవర్లలో ఇంకా 146 రన్స్ అవసరం. సిద్రా అమీన్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తోంది. భారత బౌలర్ క్రాంతి గౌడ్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.
Also Read: Mahindra Thar 3-Door: మహీంద్రా థార్ 3-డోర్ లాంచ్.. స్టన్నింగ్ లుక్, గ్రేట్ ఫీచర్స్!
అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46; 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివరలో రిచా ఘోష్ (35 నాటౌట్ ; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ (32), ప్రతీకా రావల్ (31), దీప్తి శర్మ (25), స్మృతి మంధాన (23), స్నేహ్ రాణా (20), హర్మన్‌ప్రీత్ కౌర్ (19) రన్స్ చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4, ఫాతిమా సనా 2, సాదియా ఇక్బాల్ 2 వికెట్స్ పడగొట్టారు.
