Site icon NTV Telugu

INDW vs PAKW: సేమ్ సీన్ రిపీట్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో నో హ్యాండ్‌షేక్!

No Handshake

No Handshake

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగినా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్‌కు కరచాలనం ఇవ్వలేదు. అంతేకాదు ఆసియా కప్ గెలిచినా పీసీబీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో కూడా నో హ్యాండ్‌షేక్ కొనసాగుతోంది.

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్ సందర్భంగా ఫాతిమా సనాతో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కరచాలనం చేయలేదు. భారత పురుషుల జట్టు మాదిరిగానే భారత మహిళా జట్టు కూడా పాకిస్తానీలతో కరచాలనం చేయకూడదనే తన విధానాన్ని కొనసాగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శెభాష్ హర్మన్‌ప్రీత్ అంటూ టీమిండియా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 రన్స్ చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (31), స్మృతి మంధాన (23) రన్స్ చేశారు. ప్రస్తుతం క్రీజులో హర్లీన్ డియోల్ (31), హర్మన్‌ప్రీత్ కౌర్ (16) ఉన్నారు. హర్లీన్, హర్మన్‌ప్రీత్ ఆచితూచి ఆడుతుండడంతో స్కోర్ వేగం తగ్గింది. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టారు.

Also Read: Thopudurthi Prakash Reddy: నువ్ మైసూర్ మహారాణివి ఏం కాదు.. పరిటాల సునీతపై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు!

తుది జట్లు:
భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జేమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), స్నేహ్‌ రాణా, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
పాకిస్థాన్‌: మునీబా అలీ, సదాఫ్‌ షర్మాస్, సిద్రా అమిన్, అలియా రియాజ్, సిద్రా నవాజ్ (కీపర్), ఫాతిమా సనా (కెప్టెన్), నటాలియా పర్వేజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.

Exit mobile version