NTV Telugu Site icon

INDW vs ENGW: 136 పరుగులకే ఇంగ్లీష్ బ్యాటర్లు ఆలౌట్..

Indwvsengw

Indwvsengw

India vs England: ముంబై వేదికగా ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా మహిళా టీమ్ పట్టు బిగుస్తుంది. భారత అమ్మాయిలు తలో చేయి వేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు 138 పరుగులకే ఆలౌట్‌ చేసి 292 రన్స్ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం టీమిండియా పొందింది. దీప్తి శర్మ టెస్ట్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి (5.3-4-7-5) ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాశించింది.

Read Also: Kalasa Review: కలశ రివ్యూ

ఇక, దీప్తికి స్నేహ్‌ రాణా 2 వికెట్లు తీయగా, రేణుక సింగ్‌, పూజా వస్త్రాకర్‌ తలో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (59) హాఫ్ సెంచరీ మాత్రమే టాప్‌ స్కోర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లంతా కనీసం 20 రన్స్ మార్క్ ను కూడా దాటలేకపోయారు. ఆమీ జోన్స్‌ 12, బేమౌంట్‌ 10, డంక్లీ 11, హీథర్‌ నైట్‌ 11, డేనియెల్‌ వ్యాట్‌ 19 రన్స్ చేయగా.. లారెన్‌ ఫైలర్‌ 5, కేట్‌ క్రాస్‌ ఒకటి, ఎక్లెస్టోన్‌, చార్లీ డీన్‌ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన టీమిండియా 14 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 69 రన్స్ చేసింది. ప్రస్తుతం భారత జట్టు ఓవరాల్‌గా 361 పరుగుల లీడ్‌ను సాధించింది. స్మృతి మంధన 26 రన్స్ చేసి ఔట్‌ కాగా.. షఫాలీ వర్మ (32), యస్తిక భాటియా (7) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

Read Also: CM YS Jagan: ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

అయితే, అంతకు ముందు శుభ సతీశ్‌, జెమీమా రోడ్రిగెజ్‌, యస్తికా భాటియా, దీప్తి శర్మ అర్థ శతకాలతో తొలి ఇన్సింగ్స్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. కాగా, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (49), స్నేహ్‌ రాణా (30) రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ తలో 3 వికెట్లు తీసుకోగా.. కేట్‌ క్రాస్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, చార్లెట్‌ డీన్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.