NTV Telugu Site icon

ENG vs IND: పెద్దక్కలాంటి మంధాన నుంచి క్యాప్‌ను అందుకోవడం కెరీర్‌లోనే స్పెషల్!

Jemimah Rodrigues

Jemimah Rodrigues

Jemimah Rodrigues on Debut Test Cap: తన అరంగేట్రం క్యాప్‌ను పెద్దక్కలాంటి స్మృతీ మంధాన నుంచి అందుకోవడం కెరీర్‌లోనే స్పెషల్ అని టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ తెలిపారు. టెస్టుల్లోకి అరంగేట్రం సందర్భంగా క్యాప్‌ అందించిన మంధానకు జెమీమా ధన్యవాదాలు తెలిపారు. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ మహిళా జట్టు 347 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన రోడ్రిగ్స్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేశారు.

ఇంగ్లండ్‌పై భారీ విజయం అనంతరం జెమీమా రోడ్రిగ్స్‌ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ విజయం చాలా ప్రత్యేకమైంది. టెస్టు క్రికెట్‌ ఎలా ఆడాలని భావించామో.. అంతకంటే ఎక్కువగానే శ్రమించాం. జట్టులోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఈ విజయంలో ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా నాకో ఓ ప్రత్యేకత ఉంది. నా అరంగేట్రం క్యాప్‌ను పెద్దక్కలాంటి స్మృతీ మంధాన నుంచి అందుకోవడం నా కెరీర్‌లోనే స్పెషల్’ అని జెమీమా పేర్కొన్నారు.

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు భారీ ఆఫర్!

‘ నిజాయితీగా చెప్పాలంటే.. నాకు మాటలు రావడంతో లేదు. నా సాకెప్టెన్సీలో భారీ విజయం నమోదు చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చాలాకాలం తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడా. అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో చురుగ్గా ఉండేలా మాకు సహాయం అందించిన సహాయక సిబ్బంది సేవలు అద్భుతం. ఇదే ఆట తీరును మున్ముందు కూడా ప్రదర్శిస్తామనే నమ్మకం ఉంది’ అని హర్మన్ ప్రీత్‌ కౌర్ అన్నారు.