NTV Telugu Site icon

Indore: నలుగురు యువకుల అరాచకం.. ఎస్సైపై దాడి (వీడియో వైరల్)

Police

Police

Indore: ఇండోర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాణగంగ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై తెరేశ్వర్ ఇక్కాపై మంగళవారం తెల్లవారుజామున నాలుగు మంది యువకులు దాడి చేశారు. ఈ సంఘటన అరవిందో ఆసుపత్రి సమీపంలో ఉదయం 5 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో ఎస్సైను దారుణంగా కొట్టి, బలవంతంగా క్షమాపణ చెప్పించడమే కాకుండా.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Also Read: Priyanka Chopra : ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోస్.. ఇవి చాలా హాట్ గురూ

పోలీసుల ప్రకారం, నిందితుల్లో ఒకరు జోబట్ జైలులో పనిచేస్తున్నారు. అయితే ఆయన జైలులో ఏ స్థాయిలో పనిచేస్తున్నారన్న విషయంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఘటన జరిగిన వెంటనే ఎస్సై తెరేశ్వర్‌ ఇక్కాను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. వాహన నంబర్ ఆధారంగా ప్రధాన నిందితుడు వికాస్, అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం నిందితులు తాగిన మత్తులో ఉన్నారు. వికాస్, అతని ముగ్గురు సహచరులు తమ థార్ జీపులో మద్యం సేవిస్తున్న సమయంలో ఎస్సై తెరేశ్వర్‌ వారిని ఆపి ప్రశ్నించారు. దీంతో యువకులు నోటి దురుసుగా మాట్లాడి, తీవ్రంగా విభేదించారు. నిందితులు ఎస్సై బ్యాడ్జ్, వైర్‌లెస్ సెట్ లాక్కుని దాడి చేయడమే కాకుండా, బలవంతంగా తమ జీపులో ఎక్కించి కూలీల సమక్షంలో క్షమాపణలు చెప్పించారు. అంతేకాకుండా ఎస్సైపై అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ దాడి సమయంలో ఎస్సై తెరేశ్వర్‌ పలు సార్లు వైర్‌లెస్ ద్వారా సహాయం కోరినా ఎవరూ స్పందించలేదు. రోడ్డుపై వెళ్లే ప్రయాణీకులు ఈ ఘటనను చూసి నిలబడినా, ఎవరూ ముందుకు వచ్చి సహాయం చేయలేదు.

ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి ప్రధాన నిందితుడు వికాస్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితులపై ప్రభుత్వ విధులకు ఆటంకం కల్పించడం, దాడి, దౌర్జన్యానికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేయడమే కాకుండా.. సామాజిక బాధ్యతకూ దృష్టి నిలిపింది.