NTV Telugu Site icon

Republic Day Celebrations: భారత గణతంత్ర దినోత్సవ వేడుకకు అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు…

Prabowo Subianto

Prabowo Subianto

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్ ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. గణతంత్ర దినోత్సవానికి ఇప్పటి వరకు ముగ్గురు రాష్ట్రపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందున ఆయన భారత పర్యటన కూడా ప్రత్యేకంగా మారనున్నారు.

READ MORE: IIT Baba: ‘గతజన్మలో నేను కృష్ణుడిని..’ ఐఐటీ బాబా సంచలన వ్యాఖ్యలు

భారతదేశం – ఇండోనేషియా మధ్య వ్యూహాత్మక సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా బలపడ్డాయి. జీ20, ఇండియా-ఆస్ట్రేలియా-ఇండోనేషియా గ్రూప్ ద్వారా రెండు దేశాల మధ్య సహకారం కూడా పెరిగింది. రాష్ట్రపతి హోదాలో ప్రబోవో సుబియాంటో భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు.. 2011లో సుసిలో బాంబాంగ్ యుధోయినా, 2018లో జోకో విడోడో కూడా రిపబ్లిక్ డేకి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుబియాంటో భారతదేశ పర్యటన చాలా ముఖ్యమైనది. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలు ఉండవచ్చు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే ముందు సుబ్యాంతో, ప్రధాని మోడీ శనివారం నాడు భేటీ కానున్నారు. డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరగనుంది. అనేక ఒప్పందాలపై సంతకాలు కూడా చేయవచ్చు.

READ MORE: Kejriwal: డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు