Site icon NTV Telugu

Indonesia Trishul Project: త్రిశూల్ ప్రాజెక్టుకు అతిపెద్ద ముస్లిం దేశం ప్లాన్..

Indonesia Trishul Project

Indonesia Trishul Project

Indonesia Trishul Project: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈక్రమంలో ఇండోనేషియా త్రిశూల్ అనే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశాన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇండోనేషియా దేశ రక్షణ వ్యవస్థ కోసం త్రిశూల్ అనే రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తోంది పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇండోనేషియా తన త్రిశూల్ రక్షణ వ్యవస్థ కోసం సుమారు $125 బిలియన్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతోందని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారని ఈ నివేదికలు స్పష్టం చేశాయి.

READ ALSO: CM Chandrababu Naidu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు అంశాలపై చర్చలు..!

త్రిశూల్ రక్ష కవచం అంటే..
ఇండోనేషియా ప్రభుత్వం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని యోచిస్తుంది. ప్రస్తుత రాజధాని జకార్తాను నుసంతారాకు మార్చడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వం నుసంతారాలో త్రిశూల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రణాళిక ఇండోనేషియా కొత్త రాజధానిని బాహ్య దాడుల నుంచి కాపాడుతుందని ప్రభుత్వం తెలిపింది. త్రిశూల్ ప్రణాళిక కింద ఇండోనేషియా ప్రభుత్వం జలాంతర్గాములు, యుద్ధనౌకలు, క్షిపణి సాయుధ వేగవంతమైన దాడి నౌకలు, దీర్ఘ-శ్రేణి క్షిపణులు వంటి కొత్త పరికరాలను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రణాళిక కింద కొత్త సైనికులను నియమించుకోవడానికి ప్రభుత్వం నిబంధనలను కూడా చేర్చింది.

IISS నివేదిక ప్రకారం.. ఇండోనేషియా త్రిశూల్ ప్రణాళిక కింద రెండు సెకండ్ హ్యాండ్ డస్సాల్ట్ మిరాజ్ 2000-D/ED ఫైటర్ జెట్‌లను, 24 బోయింగ్ F-15EX ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసింది. వీటిని త్వరలో ఇండోనేషియాలో మోహరించనున్నారు. అదేవిధంగా ఇండోనేషియా 24 లాక్‌హీడ్ మార్టిన్ S-70M బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, రెండు ఎయిర్‌బస్ A400M అట్లాస్ ఎయిర్‌లిఫ్టర్లు, 12 టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అంకా మీడియం-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ అన్ ఇన్హమేటెడ్ ఏరియల్ వెహికల్స్ (UAVలు) కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ దేశం ఎక్కువగా తన ఆయుధాలను ఎక్కువగా అమెరికా లేదా చైనా నుంచి కొనుగోలు చేస్తుంది, వీటిలో అమెరికా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు, చైనా నుంచి చౌకైన, తేలికైన ఆయుధాలు ఉన్నాయి.

ఆయుధాలను ఎందుకు కొనుగోలు చేస్తోంది..
ఇండోనేషియా ఇన్ని ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందనే అనుమానం అందరికి రావచ్చు. వాస్తవానికి ఈ దేశానికి మలేషియా, ఆస్ట్రేలియాతో చిన్న చిన్న ఘర్షణలు ఉన్నాయి. అయితే ఇవి చిన్న చిన్న ఘర్షణలు మాత్రమే. ముస్లిం మెజారిటీ కలిగిన ఇండోనేషియా దేశానికి పైన పేర్కొన్న దేశాలతో తప్ప ప్రస్తుతం వేరే దేశాలతో ఘర్షణ వాతావరణం లేదు. దీనివల్ల ఇండోనేషియా కొత్త ఆయుధాలను ఎందుకు ఇంత వేగంగా కొనుగోలు చేస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. నిజానికి మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండోనేషియాను ఆందోళనకు గురిచేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండోనేషియాలో 17 వేల కంటే ఎక్కువ దీవులు ఉన్నాయి. దీని వలన వాటి రక్షణ కష్టతరం అవుతుందని, అందుకే ఈ దేశం కొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రారంభించిందని అంటున్నారు.

READ ALSO: Faridabad University Raid: “టెర్రర్ క్లినిక్”.. హర్యానా ఆస్పత్రిలో జైషే లింకులు !

Exit mobile version