Indonesia : ప్రకృతి దాడి వల్ల సర్వం నాశనం అవుతుంది. కొన్నిసార్లు వర్షాలు, వరదల కారణంగా వేలు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి ఎంత మంది బలవుతారో ఎవరూ ఊహించలేరు. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఇలాంటి విధ్వంసమే జరిగింది. అక్కడ కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం కారణంగా అనధికార బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది మరణించారు. రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫిఫుద్దీన్ ఎలాహుడే మాట్లాడుతూ.. ఆదివారం, 33 మంది గ్రామస్తులు గోరంటాలో ప్రావిన్స్‌లోని రిమోట్ బాన్ బొలాంగోలో ఒక చిన్న బంగారు గనిలో బంగారు రేణువుల కోసం తవ్వుతున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా చుట్టుపక్కల కొండలపై నుంచి పెద్ద ఎత్తున మట్టి పడిపోయింది. గ్రామస్థులకు ఏమీ అర్థం కాకముందే ఆ మట్టిలో కూరుకుపోయారు.
Read Also:Samsung: 55 ఏళ్ల చరిత్రలో అతి పెద్ద సమ్మెకు పిలుపునిచ్చిన శాంసంగ్ వర్కర్స్
11 మంది మృతదేహాలు లభ్యం
సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారని అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సమయంలో గాయపడిన ఇద్దరిని రక్షించారు. సోమవారం 11 మంది మృతదేహాలను వెలికి తీశారు. తప్పిపోయిన మరో 20 మంది కోసం సహాయక సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Read Also:BCCI Prize Money: ఒక్కో ఆటగాడికి రూ.5 కోట్లు.. రిజర్వ్ ప్లేయర్స్, సహాయక సిబ్బందికి ఎంతంటే?
వర్షం కారణంగా సహాయక కార్యక్రమాలకు ఆటంకం
గోరోంటలో ప్రావిన్స్‌లోని సుమావా జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రెస్క్యూ ఏజెన్సీ బసర్నాస్ అధిపతి హెరియాంటో తెలిపారు. ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. తప్పిపోయిన వారి కోసం వెతకడానికి నేషనల్ రెస్క్యూ టీమ్, పోలీసులు, ఆర్మీ సిబ్బందితో సహా 164 మంది సిబ్బందిని ఆ ప్రాంతంలో మోహరించారు. దీనితో పాటు వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఇండోనేషియాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం. ఈ పనితో వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. వారు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయాల్సి వచ్చింది, ఈ వ్యక్తులు తరచుగా తీవ్రంగా గాయపడతారు లేదా చనిపోతారు.