Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..
- బ్రహ్మోస్‌తో పాటు భారత అస్త్ర Mk-1 క్షిపణిపై ఇండోనేషియా ఆసక్తి
- Su-30MK2 యుద్ధవిమానాలకు అస్త్రను అనుసంధానించే అవకాశాలపై పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Astra Missile: భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై విదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలుకు ఇండోనేషియా సిద్ధమైంది, ఇప్పుడు భారత్ అభివృద్ధి చేసిన ‘‘అస్త్ర Mk-1’’ గగనతల క్షిపణులను తన Su-30MK2 యుద్ధవిమానాలకు అనుసంధానించే అవకాశాలను కూడా ఇండోనేషియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అస్త్ర Mk-1 కొనుగోలుపై సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తుది నిబంధనలు, సాంకేతిక అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
అస్త్ర క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేయగా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తయారు చేస్తోంది. ఇది బియాండ్ విజువల్ రేంజ్(BVR)కు అవతల ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల ‘‘ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్’’. అస్త్రా ఎగుమతి వెర్షన్ పరిధి సుమారు 110 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఇండోనేషియా రష్యన్ తయారీ R-77 గగనతల క్షిపణులను ఉపయోగిస్తోంది. వీటి పరిధి సుమారు 70-80 కి.మీ ఉండొచ్చు. అస్త్ర Mk-1ను విజయవంతంగా సుఖోయ్ విమానాలకు అనుసంధానిస్తే ఇండోనేషియా వైమానిక దళం శక్తి మరింత పెరుగుతుంది.
Also Read
- Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
- El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
- Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Railway Group D Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 30 వేల పోస్టులతో నోటిఫికేషన్..!
ఇక్కడే ప్రధాన సమస్య..
అస్త్ర క్షిపణిని ఇండోనేషియా Su-30MK2 యుద్ధవిమానాలకు అనుసంధానించడంలో ప్రధాన సాంకేతిక సవాలు రాడార్ వ్యవస్థల తేడా ఉండటమే. భారత Su-30MKI విమానాల్లో N011M Bars రాడార్ ఉండగా, ఇండోనేషియా Su-30MK2 విమానాల్లో N001VEP పల్స్-డాప్లర్ రాడార్‌ను ఉపయోగిస్తోంది. ఈ రెండు వ్యవస్థల లక్షణాలు వేరేగా ఉంటాయి. దీంతో అస్త్ర క్షిపణిని సమర్థంగా పనిచేసేలా చేయడానికి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ అవసరమయ్యే అవకాశ ఉంది. ప్రస్తుతం.. భారత్, ఇండోనేషియా ఇంజనీర్లు క్షిపణి అనుసంధానం, అనుకూలతలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..
-
Shanarthi : కరీంనగర్ జిల్లాలో ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు
-
Kajal Aggarwal: ‘రామాయణ’ నుంచి కాజల్‌ను తీసేశారా?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!