NTV Telugu Site icon

Indo-Russian mega meet: ఇండియా-రష్యా మెగా మీటింగ్‌

Indo-Russian mega meet

Indo-Russian mega meet

Indo-Russian mega meet: ఇండియా, రష్యా దేశాల మెగా బిజినెస్‌ మీటింగ్‌ ఈ నెల 29, 30 తేదీల్లో జరగనుంది. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ ఫోరంలో భాగంగా దీన్ని ఏర్పాటుచేశారు. “అభివృద్ధి మరియు పెరుగుదల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం” అనే కాన్సెప్ట్‌తో ఈ భేటీ జరగబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఈ సంవత్సరం 50 బిలియన్‌ డాలర్లకు చేర్చటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

TCS New CEO Krithivasan: టీసీఎస్‌ CEOగా సరైనోడే. కృతివాసన్‌పై అందరిదీ ఇదే మాట

ఇది 2022లో నిర్దేశించుకున్న టార్గెట్‌ కన్నా ఒక బిలియన్‌ డాలర్లు ఎక్కువగానే.. అంటే.. రికార్డు స్థాయిలో 31 బిలియన్‌ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఇండియాకి చమురు మరియు ఎరువుల దిగుమతులు ఆశించినదానికన్నా ఎక్కువగా జరగటం ఈ రెండు దేశాల నడుమ అనూహ్యమైన వాణిజ్య వృద్ధికి దోహదపడింది.

ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ ఫోరం ముఖ్యంగా ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ, సాంకేతిక సార్వభౌమాధికారం, స్మార్ట్‌ సిటీలు, ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌, హెల్త్‌ కేర్‌, ఫార్మాస్యూటికల్స్‌ వంటి అంశాలపై ఫోకస్‌ పెట్టనుంది. గ్రేటర్ యురేషియాలో సాంకేతిక పొత్తులు అనే ఫోకల్‌ పాయింట్‌ మీద ఫోరం ప్లీనరీ సెషన్‌ జరగబోతోంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంత దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావటానికి ఇండియా-రష్యా సహకారం ఎంతో ప్రధానమని ఆ దేశ అధ్యక్షుడి సలహాదారు అంటోన్ కోబ్యాకోవ్ పేర్కొన్నారు.

రష్యా వ్యాపార సంస్థలు భారతదేశంలోకి రంగ ప్రవేశం చేయటం ద్వారా రెండు దేశాల వ్యాపార వర్గాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించటం కోసం ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ ఫోరం కృషి చేస్తుందని తెలిపారు.

Show comments