IndiGo chaos: 1000 పైగా విమానాలు రద్దు, డీజీసీఏ నిబంధనల్ని పాటించకుండా, ప్రభుత్వానికే సవాల్ విసిరేలా ‘‘ఇండిగో’’ ప్రవర్తించిన తీరును దేశం మొత్తం గమనిస్తోంది. లక్షలాది మంది ప్రయాణికుల అవస్థలకు కారణమైంది. డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ నిర్వహణ లోపం, మారిన నిబంధనలకు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇండిగో గందరగోళం చెలరేగింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైనర్, మార్కెట్లో మెజారిటీ షేర్ కలిగిన ఇండిగో కావాలనే ఇలా తన వ్యవస్థల్ని కుప్పకూల్చిందని సాధారణ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వంపైనే ఒత్తిడి తీసుకువచ్చేలా చేస్తోందని మండిపడుతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూర్ ఇలా ప్రతీ నగరంలోని ఎయిర్‌పోర్టులో గందరగోళం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, ప్రభుత్వం తన పవర్ చూపించాల్సిన సమయం వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ ఇండిగో క్రైసిస్ ఏర్పడింది. 2009లో పుతిన్, ప్రభుత్వ అధికారాన్ని చూపించినట్లే ఇప్పుడు భారత్ వ్యవహరించాలని కోరుతున్నారు.
పుతిన్ ఏం చేశారు?
2009లో రష్యాలోని పికల్యోవో నగరంలో, బిలియనీర్ ఒలెన్ డెరివాస్కా యాజమాన్యంలో మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే, ఇతను తన కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీంతో కార్మికులు ఆగ్రహంతో రోడ్డు మీదకు వచ్చారు. హైవేలను బ్లాక్ చేశారు. ఈ సమయంలో అప్పటి రష్యా ప్రధాని పుతినన్ హెలికాప్టర్లో అక్కడికి చేరుకుని, కెమెరాల లైవ్ నడుస్తుండగా ఒలెన్ డెరివాస్కాపై మండిపడ్డారు. అతడిని పురుగుగా అభివర్ణించారు.
పుతిన్, డెరివాస్కాపై ఒక ఒప్పంద పత్రాన్ని విసిరి సంతకం చేయాలని హెచ్చరించారు. డెరివాస్కా వణుకుతూ సంతకం చేశారు. వెళ్తూ డెరివాస్కా పుతిన్ పెన్ను తీసుకెళ్తుండం చూసి, ‘‘పెన్ను ఇక్కడే పెళ్లి వెళ్లు’’ అని గట్టిగా హెచ్చరించారు. ఈ సీన్ రష్యాలో అప్పటి అధికారానికి ప్రతీకగా నిలిచింది. దేశ ప్రభుత్వం తలుచుకుంటే ఎంతటి శక్తివంతమైన వారిని కూడా మెడలు వచ్చొచ్చని నిరూపించిన ఘటనగా నిలిచింది.
ఇండిగో మెడలు వంచాలి
ఇండిగో ప్రభుత్వాన్నే బెదిరించేలా వ్యవహరిస్తోందని సాధారణ ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇండిగో సంఘటన కేవలం విమానాల రద్దు మాత్రమే కాదని, ఇది దేశ అధికారాన్ని అధిగమించే ప్రమాదానికి సంకేతమని అభిప్రాయపడుతున్నారు. పుతిన్ 2009లో చేసిన విధంగానే ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని మించిపోయే కంపెనీలకు బుద్ధి చెప్పాలని నెటిజన్లు చెబుతున్నారు. ఈ సంఘటనను యూపీఎస్సీ కోచింగ్ గురువు శేఖర్ దత్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
This alleged arm twisting of govt by Indigo reminds me of 2009
About a Putin master class on how to handle oligarchs and oligopolies
That when in 2009 a struggling factory wasn't paying its workers, Putin publicly confronted its billionaire owner, Oleg Deripaska
He made him… pic.twitter.com/kRzSeDj3dp
— Shekhar Dutt (@DuttShekhar) December 5, 2025