NTV Telugu Site icon

ISRO Chairman: ఇండిగో విమానం ఎక్కిన ఇస్రో చైర్మన్.. అక్కడి సిబ్బంది ఏం చేసిందంటే?

Isro

Isro

IndiGo Cabin Crew Welcomes ISRO Chief S Somanath: ఆగస్ట్ 23 ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిన రోజు. అంతరిక్ష పరిశోధనల్లో ఇండియా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న రోజు. అగ్ర రాజ్యాలు కూడా ఇప్పటి వరకు వెళ్లని జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని భారత్ చంద్రయాన్-3 చేరిన రోజు. ఇక అప్పటి నుంచి భారత్ మాత్రమే కాకుండా భారత అంతరిక్ష సంస్థ పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఇస్రో శాస్ర్తవేత్తలు ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిలో హీరోలు అయిపోయారు. కేవలం తమ పని తాము చేసుకుంటూ దేశం కోసం శ్రమిస్తూ కూడా అంత ఎక్కువగా ఎవరికీ తెలియని వారు ఒక్కసారిగా అందరికి తెలిసి ఫేమస్ అయిపోయారు. దీంతో ఎక్కడికి వెళ్లినా వారికి సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ విశేష గౌరవాభిమానాలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ సోమ్ నాథ్ కు ప్రత్యేక గౌరవం దక్కింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read: Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. రెండో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

ఇటీవల ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ పని మీద ఇండిగో విమానంలో ప్రయాణించారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులను దేశమంతా ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండిగో కూడా సోమ్ నాథ్ తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చూపించింది. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించారు. ఆయన తమ విమానంలో ప్రయాణించడాన్ని ఎంతో ప్రత్యేకంగా భావించిన ఇండిగో ఇలా తన అభిమానాన్ని చూపింది.

ఇక అనౌన్స్ మెంట్ లో ఇలా పేర్కొన్నారు. “”ఇవాళ ఈ విమానంలో ఓ విశిష్ట వ్యక్తి కూడా మనందరితో పాటు ఉన్నారు. మీరు (సోమ్ నాథ్) ఈ విమానంలో ఉన్నందుకు  ఎంతో సంతోషిస్తోంది ఇండిగో. మీకు సేవలు అందించే అవకాశం లభించడాన్ని మేం అదృష్టంగా భావిస్తున్నాం. మీరు దేశం గర్వించేలా చేశారు. మీకు ధన్యవాదాలు ” అంటూ గౌరవ వచనాలు పలికారు. అనౌన్స్ మెంట్ తరువాత విమానం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఇక దీని తరువాత సోమ్ నాథ్ కు ఎయిర్ హోస్టెస్ ఫుడ్ అందిస్తూ, ఇండిగో తరుపున ప్రత్యేక గ్రీటింగ్ కార్డును కూడా అందజేశారు. తరువాత అక్కడ ఉన్న వారిలో చాలా మంది ఆయన ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.