India’s Services Exports: మన దేశంలో సేవల రంగం పనితీరు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని దాటేస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ ఇండియా సర్వీస్ ఎక్స్‌పోర్ట్‌లు 300 బిలియన్ డాలర్ల టార్గెట్‌ను క్రాస్ చేయనున్నాయని తెలిపింది. ఈ మేరకు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌లో దాదాపు 20 శాతం గ్రోత్ నమోదు చేస్తామని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ శాఖల మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు.
read more: STUMAGZ: మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ స్థాయి వేదిక.. స్టుమాగ్
ప్రపంచం నలుమూలలా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వివిధ సరుకుల ఓవర్ స్టాకింగ్ వంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇండియా ముందుకే సాగుతుందని ధీమా వెలిబుచ్చారు. 2022 ఏప్రిల్-డిసెంబర్‌లో భారతదేశ సేవల ఎగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 9 శాతం పెరిగాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితర కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయనటానికి ఇదే నిదర్శమని చెప్పారు.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు.. 9 నెలల్లో సేవల రంగం చేసిన ఎగుమతుల విలువ 235.81 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంలో సర్వీస్‌ల ఎక్స్‌పోర్ట్‌ల వ్యాల్యూ 184 పాయింట్ ఆరు ఐదు బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద సేవల రంగం ఎగుమతులు ఆల్ టైమ్ హై లెవల్‌లో.. అంటే.. 254 బిలియన్ డాలర్లుగా నమోదవటం విశేషం.
