Site icon NTV Telugu

Fancy Number: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ గా ‘HR88B8888’.. వేలంలో ఎంత ధర పలికిందంటే..?

Hr88b8888

Hr88b8888

Fancy Number: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు తాజాగా హర్యానాలో నమోదైంది. తాజాగా నిర్వహించిన VIP నంబర్ ప్లేట్‌ల ఆన్‌లైన్ వేలంలో ‘HR88B8888’ అనే నంబర్ రూ. 1.17 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడబోయింది. బుధవారం ముగిసిన ఈ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీలో పాల్గొన్నారు. రూ. 50,000 బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ఈ నంబర్ ధర నిమిషానికోసారి పెరుగుతూ చివరకు కోట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ధర రూ. 88 లక్షలకు చేరగా.. సాయంత్రం 5 గంటలకు రూ. 1.17 కోట్ల వద్ద వేలం ముగిసింది.

Bajaj RIKI: బజాజ్ ఆటో కొత్త రికి ఈ-రిక్షా విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 164KM రేంజ్.. ధర ఎంతంటే?

హర్యానా ప్రభుత్వం ప్రతి వారం fancy.parivahan.gov.in పోర్టల్ ద్వారా VIP, ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నమోదులు ప్రారంభమై, సోమవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత బుధవారం 5 గంటలకు వేలం ఫలితాలు వెలుబడుతాయి. గత వారం ‘HR22W2222’ నంబర్ రూ. 37.91 లక్షలకు అమ్ముడపోయింది. ఇక ‘HR88B8888’ నంబర్ ప్రత్యేకత ఏమిటంటే.. పెద్ద అక్షరం ‘B’ ఆకారంలో ‘8’ను పోలి ఉండడమే. అలాగే నంబర్‌లో వరుసగా ఉన్న ఎనిమిదులు దీనికి శుభప్రదతతో పాటు ప్రీమియం లుక్‌ను కూడా అందించాయి.

Reliance Hyperscale Data Center: గూగుల్‌ బాటలో రిలయన్స్‌.. ఏపీలో మరో భారీ పెట్టుబడి..

ఇందులో HR అంటే హర్యానా రాష్ట్ర కోడ్, 88 అంటే RTO కోడ్, B వాహన సిరీస్, 8888 ప్రత్యేక నాలుగు అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మొత్తం నంబర్ ప్లేట్ ఎనిమిదుల వరుసలా కనిపించడం దీనిని అత్యంత విలువైనదిగా మార్చింది. మొత్తానికి ‘HR88B8888’ నంబర్ ప్లేట్ రూ. 1.17 కోట్ల ధరకు అమ్ముడవడం భారతదేశంలో VIP నంబర్లకు ఉన్న పెరుగుతున్న డిమాండ్‌కి ఉదాహరణగా నిలిచింది.

Exit mobile version