Site icon NTV Telugu

Gold Mines in India: గుడ్ న్యూస్.. త్వరలో మన దేశంలోనే బంగారం గని ప్రారంభం

New Project (79)

New Project (79)

Gold Mines in India: భారతదేశంలో బంగారం వినియోగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం సామాన్యులు వేల టన్నుల బంగారాన్ని కొంటారు. ఈ భారీ డిమాండ్‌ను తీర్చడానికి భారత్ బయటి నుండి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు త్వరలో ఈ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించవచ్చు. దేశంలోనే బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దేశంలోనే తొలి ప్రైవేట్‌ గోల్డ్‌ మైన్‌ త్వరలో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. భారతదేశంలోని మొట్టమొదటి పెద్ద బంగారు గనిలో ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 2024 నాటికి జోనగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించవచ్చని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఆపరేషన్‌ కొనసాగుతోంది.

ప్రతేడాది ఎంత ఉత్పత్తి అవుతుందంటే?
జోనగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే.. ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల మేర ఈ గనిలో పెట్టుబడులు పెట్టగా ప్రస్తుతం అక్కడ నెలకు సుమారు కిలో బంగారం ఉత్పత్తి అవుతోంది. గనిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ ఆకాంక్షించారు.

Read Also:YSRCP Representatives Meeting: వైసీపీ ప్రతినిధుల సభ లైవ్.. సీఎం కీలక ఆదేశాలు

ఏకైక లిస్టెడ్ కంపెనీ
ఈ బంగారు గనులు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉన్నాయి. జోనగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల చుట్టూ ఉన్నాయి. ఈ గని 2013 సంవత్సరంలో ఆమోదించబడింది. అక్కడ బంగారాన్ని కనుగొనడానికి కంపెనీకి 8-10 సంవత్సరాలు పట్టింది. జోనగిరి గోల్డ్ మైన్స్‌ను జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. ఇందులో డెక్కన్ గోల్డ్ మైన్స్ 40 శాతం వాటాను కలిగి ఉంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ దేశంలోనే మొదటి, ఇప్పటివరకు బీఎస్ఈలో జాబితా చేయబడిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థ.

కిర్గిస్థాన్‌లో కూడా బంగారు గని
డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు దేశం వెలుపల కూడా బంగారు గనులు ఉన్నాయి. ఈ విషయమై ఎండీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. కిర్గిజ్‌స్థాన్‌లో ఉన్న గోల్డ్‌ మైన్‌ ప్రాజెక్ట్‌లో కంపెనీకి 60 శాతం వాటా ఉందన్నారు. అక్కడ కూడా వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కిర్గిజ్‌స్థాన్‌లోని ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది.

Read Also:Bhagavanth Kesari Trailer: దసరా దావత్ షురూ.. ఓరుగల్లు గడ్డపై బాలయ్యబాబుకు తలకాయ కూర!

Exit mobile version