Site icon NTV Telugu

Big Robbery: దేశంలోనే భారీ దోపిడి.. రూ.400 కోట్లు కొట్టేసిన దొంగలు

Big Robbery

Big Robbery

Big Robbery: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ దోపిడి జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా సరిహద్దు ప్రాంతమైన బోర్లా ఘాట్లో 400 కోట్ల రూపాయలు కొట్టేసారు దోపిడి దొంగలు. డబ్బు తరలిస్తున్న రెండు కంటైనర్లను దోచుకున్నారు దొంగలు. దేశంలో ఇంతవరకు జరిగిన పెద్ద దారి దోపిడిలో ఇదే అతి పెద్దది. నాసిక్ కు చెందిన సందీప్ దత్త పాటీల్ ఇటివల మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసుల నుంచి కర్ణాటక పోలీసులకు లేక వచ్చినట్టు బెగావి ఎస్పి రామరాజన్ తెలిపారు.

దోపిడి జరిగి కూడా మూడు నెలలకు పైగా గడిచిపోయింది. కానీ ఇప్పుడు హడావిడి చేస్తున్నారు పోలీసులు. గత ఏడాది అక్టోబర్ 16న తను కిడ్నాప్ చేసినట్టు మహారాష్ట్రలోని నాసిక్ పరిదిలో గల ఘోటి పోలీసులకు సందీప్ దత్త ఫిర్యాదు చేశాడు. విరాట్ గాంధీ ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేసినట్టుగా చెప్పాడు. దీంతో నాసిక్ లో కేసు నమోదయింది. అయితే ఆలస్యంగా జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి బెళగావి ఎస్పీ కి ఒక లేఖ వచ్చింది. దాని ద్వారానే భారీ నగదు దోపిడి అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని నాసిక్ కు పంపించారు బెళగావి పోలీసులు.

Abhishek Sharma: అదేం బ్యాటింగ్‌రా సామీ.. 10 బంతుల్లోనే 50 రన్స్ చేస్తాడు!

ఇక ఫిర్యాదు అందిన తర్వాత కేస్ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు మూడు నెలలు గడిచిన దర్యాప్తులో పురోగతి సాధించలేకపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కర్ణాటక పోలీసులు సాయం కోరుతూ లేఖ రాశారు. అయితే డబ్బు ఎవరిది..? కంటైనర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తర్లిస్తున్నారు..? వంటి వివరాలు మాత్రం కర్ణాటక పోలీసులకు ఇవ్వలేదు. దోపిడి జరిగినట్టు చెప్తున్నది గోవా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతం. అందువల్ల మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా తనికి చేయాల్సి ఉంది.

గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకు నగదు రవాణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నగదు ముంబై తానేలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టికి చెందిందా ప్రచారం జరుగుతోంది. మరొకవైపు గోవాకు చెందినటువంటి బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థకు చెందిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో జయేష్ కదం, విశాల్ నాయుడు, సునీల్ దమాల్, విరాట్ గాంధీ, జనార్ధన్ తాయిగుడెను నిందితులుగా నాసిక్ పోలీసులు గుర్తించారు. ఇటివల విరాట్ గాంధీని అరెస్ట్ చేసినట్టుగా బెళగా పోలీసులకు నాసిక్ పోలీసులు సమాచారం ఇచ్చారు.

Journalist Accreditation Rules: జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కీలక మార్పులు.. మహిళలకు 33% రిజర్వేషన్!

అయితే ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడికి గురైన సొమ్ము నిజంగా 400 కోట్లు కాదో స్పష్టత లేదు. కానీ ఈ దోపిడి బెవి జిల్లా పరిధిలో జరిగినట్టు నిర్ధారణ కావడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు కర్ణాటక పోలీసులు. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు బెవఎస్పీ. దోపిడికి గురైన డబ్బు 2000 రూపాయల నోట్ల రూపంలో ఉందని తెలుస్తుంది. రద్దైన నోట్లే అయితే అవి చెల్లవు కనుక కేసు ఉండదని కొందరు చెప్తున్నారు. అయితే దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version