ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం వడోదరలో జరిగింది. ఇందులో భారత్ విజయం సాధించింది. సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు జనవరి 14, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్ వేళ భారత క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకుని తన రిటైర్మెంట్ ప్రకటించారు. భారత క్రికెటర్ కె.సి. కరియప్ప సోషల్ మీడియా పోస్ట్‌లో తన రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరపున ఆడకపోయినా, ఐపీఎల్‌లో ఆడుతూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు.
Also Read:Devdutt Padikkal: విరాట్ – రోహిత్‌లకు సాధ్యం కానీ రికార్డ్.. ట్రోఫీ చరిత్రలో ఒకే ఒక్కడికి సొంతం!
సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌లో కరియప్ప తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఈ ప్రయాణం ప్రారంభమైన వీధుల నుండి స్టేడియం లైట్ల వరకు, జెర్సీ ధరించడం వరకు. నేను ఒకప్పుడు కలలుగన్న కలను జీవించాను. ఈ రోజు నేను అధికారికంగా BCCI క్రికెట్ నుండి నా రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్నాను. ఈ ప్రయాణం నాకు చాలా ఇచ్చింది. నన్ను నవ్వించిన విజయాలు, నన్ను విచ్ఛిన్నం చేసిన ఓటములు, నాకు నేనేంటో నిరూపించిన పాఠాలు అని రాసుకొచ్చారు.
కరియప్ప తన రాష్ట్రం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ప్రోత్సహించినందుకు, నాకు మార్గనిర్దేశం చేసినందుకు, అవసరమైనప్పుడు నన్ను నమ్మినందుకు KSCA కి నేను చాలా కృతజ్ఞుడను. ఇంకా, నాకు, నా కుటుంబానికి మద్దతు ఇచ్చినందుకు మిజోరాం క్రికెట్ అసోసియేషన్ కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
Also Read:Suryalanka Beach: మారనున్న సూర్యలంక బీచ్ రూపురేఖలు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఏరియల్ సర్వే..
2015లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కరియప్ప తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. 2017 నుండి 2018 వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2021 నుండి 2023 వరకు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు, 11 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. దేశీయ క్రికెట్‌లో, కరియప్ప 14 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 75 వికెట్లు పడగొట్టాడు. 20 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 24 వికెట్లు కూడా పడగొట్టాడు. అతను తన T20 కెరీర్‌ను 58 వికెట్లతో ముగించాడు.
