Site icon NTV Telugu

Zim Afro T10: జిమ్ ఆఫ్రో టీ10 లీగ్లో సత్తా చూపని భారత వెటరన్లు..!

Zim Afro

Zim Afro

జింబాబ్వేలో జరుగుతున్న జిమ్‌ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్‌ ప్లేయర్స్ కొద్దోగొప్పో ప్రదర్శన మాత్రమే చూపిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం భారత్ కు చెందిన ఆరుగురు వెటరన్లు పాల్గొన్నారు. ఐతే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన చూపలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్‌ కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే హరారేకు చెందిన ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ బ్యాటింగ్‌ (4), బౌలింగ్‌ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా ఫెయిలయ్యాడు. చెప్పుకోదగ్గ వారిలో హరారే ఆటగాడు రాబిన్‌ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

కేప్‌ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టౌన్‌ సాంప్‌ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్‌ (25) స్కోర్‌ చేశాడు. దీంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 పరుగులు చేయగా.. హరారే హరికేన్స్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 97/6 స్కోర్‌ చేసి 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. డర్బన్‌ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్‌ బఫెలోస్‌ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ సైతం నిరాశపరిచాడు. యూసఫ్ 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్‌ బఫెలోస్‌.. టామ్‌ బాంటన్‌ (55 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. డర్బన్‌ ఖలందర్స్‌ మరో 5 బంతులు ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్ లో హజ్రతుల్లా జజాయ్‌ (41 నాటౌట్‌) విజృంభించడంతో డర్బన్‌ను గెలిపించాడు.

CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ

నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్స్‌.. బెన్‌ మెక్‌డెర్మాట్‌ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్‌ ఆర్మీని గెలిపించాడు. కాగా.. జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్‌ పటేల్‌, స్టువర్ట్‌ బిన్నీ (కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ), రాబిన్‌ ఉతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌, శ్రీశాంత్‌ (హరారే హరికేన్స్‌), యూసఫ్‌ పఠాన్‌ (జోబర్గ్‌ బఫెలోస్‌) జట్ల తరుపున ఆడుతున్నారు.

Exit mobile version